మాది చెత్త బౌలింగ్.. అందుకే భారత బ్యాట్స్‌మెన్లు ఉతికేశారు : జాసన్ హోల్డర్
తమ బౌలర్లు చెత్త బౌలింగ్ చేశారనీ, అందువల్లే భారత బ్యాట్స్‌మెన్లు ఉతికి ఆరేశారని వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నారు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండ
తమ బౌలర్లు చెత్త బౌలింగ్ చేశారనీ, అందువల్లే భారత బ్యాట్స్‌మెన్లు ఉతికి ఆరేశారని వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నారు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టుపై భారత్ 92 పరుగుల తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
దీనిపై విండీస్ కెప్టెన్ హోల్డర్ స్పందిస్తూ... జట్టు కనీస స్థాయిలో కూడా పోరాట పటిమ చూపలేదన్నాడు. బౌలింగ్‌లో ఘోరవైఫల్యం చెందామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ స్కోరు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ముందే లొంగిపోయామన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో తమ జట్టు బౌలింగ్ బాలేదని అంగీకరించాడు.
ప్రత్యర్థి జట్టుపై కనీస ఒత్తిడి తేలేకపోయామన్నారు. తాము బౌలింగ్ చేసిన విధానం టెస్టు క్రికెట్‌కు సరిపోదన్నారు. బౌలింగ్ విభాగంలో వైఫల్యమే తొలిటెస్టు ఓటమికి కారణమని చెప్పిన హోల్డర్, బౌలింగ్ విభాగంలో చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. తర్వాత జరగనున్న టెస్టు నాటికి పుంజుకుని టీమిండియాకు గట్టిపోటీ ఇస్తామని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.