2019 వరల్డ్‌కప్ తర్వాత కూడా ఆడగలను: మహేంద్ర సింగ్ ధోనీ
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి, టెస్టు కెప్టెన్సీ నుంచి కూల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుని చాలాకాలమైంది. దీంతో టెస్ట్ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తనదైన శైలిలో విజయ
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి, టెస్టు కెప్టెన్సీ నుంచి కూల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుని చాలాకాలమైంది. దీంతో టెస్ట్ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తనదైన శైలిలో విజయాలతో దూసుకుపోతున్నాడు. కానీ ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ధోనీ లేకపోవడం రిస్కేనని అన్నట్లు సమాచారం.
కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించడంపై కిర్‌స్టెన్ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ధోనీని తొలగించడం మాత్రం భారత జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గొప్ప ఆటగాళ్లు చివరి వరకూ వారి సేవలను అందించగలరని గ్యారీ కిర్‌స్టన్ అన్నారు. ఒకవేళ ధోనీ కెప్టెన్‌గా లేకపోతే 2019లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలు తగ్గుతాయని కూడా గ్యారీ గతంలో అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో క్రికెట్‌నుంచి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలేదని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పకనే చెప్పేశాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీతో ధోనీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని వచ్చిన ఊహాగానాలకు ధోనీ చెక్ పెట్టాడు. అంతేగాకుండా 2019 ప్రపంచకప్‌కు తర్వాత ఆడుతానన్నట్లు చెప్పాడు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నధోనీ నూటికి నూరు శాతం 2019 వరల్డ్‌కప్ ఆడగలనా అంటే తాను చెప్పలేనని.. ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో.. ఈలోగా గాయాల పాలవ్వచ్చు. ఏదైనా జరగొచ్చునని ధోనీ అన్నాడు. అయితే ప్రస్తుతం తన ఫిట్‌నెస్ ఆధారంగా చెప్పాలంటే మాత్రం 2019 వరల్డ్‌కప్ తర్వాత కూడా ఆడగలనని మహేంద్రుడు అన్నాడు.
35 ఏళ్లు దాటిన ధోనీ.. ప్రపంచ కప్ కూడా ఆడతాననే విధంగా కామెంట్స్ చేయడం అందరికీ షాక్ ఇచ్చినట్లే. ఒకవేళ అదే జరిగితే మహీ నాలుగు వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది.