Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్గాన్ క్రికెట్ ఫ్యాన్స్ వీరంగం.. వీడియో షేర్ చేస్తూ అక్తర్ ఫైర్ (Video)

Afganistan
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:54 IST)
Afganistan
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్- ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. క్రికెట్ ప్రపంచం తీసుకున్నంత ఈజీగా ఈ ఓటమిని అఫ్గాన్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. ఓటమి జీర్ణించుకోని అఫ్గాన్ ఫ్యాన్స్.. స్టేడియంలో పాక్ అభిమానులపై దాడి చేశారు. 
 
దీనిపై పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ అక్తర్ ట్విట్టర్‌లో స్పందించాడు. "అఫ్గాన్‌ అభిమానులు చేస్తున్న పని ఇదే. ఇది వారు గతంలో అనేక సార్లు చేసారు. ఇది ఒక గేమ్, దీనిని సరైన స్ఫూర్తితో ఆడాలి, తీసుకోవాలి. షఫిక్ స్టానిక్జాయ్ (అఫ్గాన్ క్రికెట్  బోర్డు లో కీలక సభ్యుడు) మీరు క్రికెట్‌లో ఎదగాలంటే ముందు మీ అభిమానులు, ఆటగాళ్లు ఆటకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవాలి..అంటూ హితవు పలికాడు. 
 
అఫ్గాన్-పాక్ జట్ల మధ్య బుధవారం షార్జాలో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓటమిని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అఫ్గాన్-పాక్ మ్యాచ్ ముగిశాక షార్జా క్రికెట్ స్టేడియంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు రచ్చరచ్చ చేశారు. షార్జా స్టేడియం స్టాండ్స్‌లో  తమతో పాటు మ్యాచ్ చూసిన పాక్ అభిమానులపై దాడికి దిగారు. స్టాండ్స్‌లో ఉన్న కుర్చీలను తీసి వాళ్ల మీదకు విసిరారు. చైర్స్‌ను చెల్లాచెదురుగా పడవేసి అక్కడ వీరంగం సృష్టించారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ పేసర్ షోయభ్ అక్తర్  తన ట్విటర్ ఖాతా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అఫ్గాన్ ఫ్యాన్స్‌తో పాటు వారి ఆటగాళ్లపై చిందులేస్తున్న అక్తర్.. ముందు తన జట్టు ప్రవర్తన గురించి కూడా ఆలోచించుకుంటే మంచిదని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. అసిఫ్ అలీ వ్యవహారం, గతంలో అతడు క్రికెట్ ఆడేప్పుడు భారత్‌తో పాటు ఇతర దేశాలతో అక్తర్ వ్యవహరించిన తీరు.. ఆ జట్టు అభిమానుల ఆగడాలు అప్పుడే మరిచిపోయారా..? అంటూ ప్రశ్తిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ : భారత్ ఆశలు గల్లంతు.. ఫైనల్లో పాకిస్థాన్