పాకిస్థాన్ మహిళా క్రికెటర్‌కు చేదు అనుభవం.. ఇంటికి బైకులో వెళ్ళింది..
ఐసీసీ ప్రపంచకప్ ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. అయితే మహిళా ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు అన్నింటిలోనూ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కెప్టెన్‌ను తొలగిస్తున్నట్లు బోర్డు
ఐసీసీ ప్రపంచకప్ ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. అయితే మహిళా ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు అన్నింటిలోనూ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కెప్టెన్‌ను తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ప్రపంచకప్ ముగించుకుని స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ మహిళా క్రికెటర్ నష్రా సంధు (19)కు లాహోర్ ఎయిరపోర్టులో అనూహ్య ఘటన ఎదురైంది.
ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తగిన సౌకర్యాలు చేయకపోవడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు మోటర్ బైక్‌పై వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన మీడియా కంట పడింది. పాకిస్థాన్ ఓ ప్రముఖ ఛానల్ దీన్ని ప్రసారం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాకిస్థాన్‌లో నెలకొన్న భద్రతా కారణా దృష్ట్యా పురుషుల మ్యాచ్‌లు ఆడేందుకు మిగిలిన దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. పురుషుల జట్టు ఇటీవల ఛాంపియన్స్ ట్రోపీ గెలిచినా.. అది మిగతా దేశాలను తమ దేశానికి రప్పించేందుకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు.