ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు భజ్జీ- అంబటి రాయుడు మైదానంలో గొడవకు దిగారు. పుణేతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా 11వ ఓవర్లో భజ్జీ బౌలింగ్‌లో తివారీ బౌండరీ కొట్టాడు. ఈ బంతిని ఆపేందుకు అంబటి డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. డైవ్ చేసినా బంతిని ఆపలేకపోయాడు. దీంతో రాయుడిని భజ్జీ తిట్టి పారేశాడు.
సౌథీ క్యాచ్ చేయాల్సిన బంతి కోసం నువ్వెందుకు వచ్చావన్నట్లు నోరుపారేసుకున్నాడు. దీంతో అంబటికి కోపం వచ్చింది. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తూనే భజ్జీపై మండిపడ్డాడు. అంబటి కోపం గ్రహించి భజ్జీ కాస్త తగ్గి సారీ చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే రాయుడు మాత్రం కోపంగా భజ్జీ చేతిని కోపంగా విదిలించుకుని వెళ్ళిపోయాడు. అయితే, ఆ తర్వాత 13వ ఓవర్లో హాండ్స్ కోంబ్‌ను అవుట్ చేసిన భజ్జీని అంబటి రాయుడు అభినందించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల వార్‌కు తెరపడినట్లైంది.