Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌‌గా కోహ్లీ SHAME ట్వీట్.. పెళ్లి చేసుకుంటానన్న అనుష్క శర్మ..

టీ20 మ్యాచ్‌ల్లో తన వైఫల్యానికి అనుష్కనే కారణమంటూ నెటిజన్లు ఆమెను కించపరచడాన్ని తప్పుబడుతూ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తన

Advertiesment
Virat Kohli
, గురువారం, 8 డిశెంబరు 2016 (12:43 IST)
టీ20 మ్యాచ్‌ల్లో తన వైఫల్యానికి అనుష్కనే కారణమంటూ నెటిజన్లు ఆమెను కించపరచడాన్ని తప్పుబడుతూ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తన పేలవ ప్రదర్శనకు అనుష్క శర్మయే కారణమంటూ సోషల్ మీడియా వచ్చిన ట్వీట్లకు గాను కోహ్లీ SHAME అంటూ చేసిన ట్వీట్ గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. 
 
2016 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లను ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్‌గా కోహ్లి అనుష్కను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ నిలిచింది. కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యను లక్షా ఏడువేలమందికిపైగా లైక్‌ చేశారు. అనుష్కకు మద్దతుగా కోహ్లి తొలిసారి పోస్టు చేసిన ఈ ఫేస్‌బుక్‌లో కూడా వైరల్ అయింది. అనుష్క శర్మను కించపరచకండి.. కించపరిచే వాళ్లను చూసి సిగ్గుపడుతున్నా.. అనుష్క తనకు ఎప్పుడూ సానుకూల శక్తేనని కోహ్లీ పేర్కొన్నాడు.
 
ఈ ట్వీట్‌ ట్విట్టర్‌లో రికార్డుస్థాయిలో 39 వేల సార్లు రీట్వీట్‌ అయింది. ఆసక్తికరంగా కోహ్లీ ట్వీట్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్‌ను కూడా అధిగమించడం గమనార్హం. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్‌ ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లలో రెండోస్థానంలో నిలిచింది.
 
ఇక మూడో ప్రభావవంతమైన ట్వీట్‌గా 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ నిలిచింది. నాలుగో స్థానంలో రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించిన దీపా కర్మాకర్‌, సాక్షి మాలిక్‌, పీవీ సింధు నిలిచారు. కాగా బాలీవుడ్ తార కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ తన పెళ్లిపై స్పందించింది. 
 
పెళ్లి చేసుకుంటాను కానీ.. ఎప్పుడనేది మాత్రం తనక్కూడా తెలియదని చెప్పింది. ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఆలోచించలేదని, అందరి లాంటిదే తన జీవితం కూడా.. తప్పకుండా పెళ్ళి పీటలు ఎక్కుతానని క్లారిటీ ఇచ్చింది. ఇక పెళ్లికి తర్వాత నటించడంపై అనుష్క స్పందిస్తూ.. గతంలో పోల్చిచే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని.. పెళ్లైనా కెరీర్‌ను కొనసాగిస్తానని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెస్టుల్లో సచిన్ ఒకేసారి స్టంపౌట్ అయ్యేందుకు సెహ్వాగే కారణమట..