ఐపీఎల్-10: బెంగళూరు చెత్త ప్రదర్శన.. క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే చివరి టెస్టుకు గాయం కారణంగా దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆపై ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీ
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే చివరి టెస్టుకు గాయం కారణంగా దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆపై ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లోనూ మెరవలేకపోయాడు. ఇంకా ఐపీఎల్ పదో సీజన్లో కోహ్లీ ప్రాతినిధ్యం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన చేస్తూ, ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
ఐపీఎల్ పదో సీజన్లు ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. మిగిలిన పది మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల నుంచి ఖంగుతింది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, అభిమానులను తాము ఎంతో నిరాశకు గురి చేశామన్నాడు. అభిమానులు ఊహించుకున్న స్థాయికి తగినట్లు ఆడలేకపోయినందుకు కోహ్లీ క్షమాపణలు చెప్తూ ట్వీట్ టేశాడు. ఇంకా తనను ఎంతగానో ఆదరిస్తున్న ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు.