Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొన్ని కావాలంటే కొన్ని మానేయాల్సిందేగా అంటున్న కోహ్లి

కోహ్లీకి అత్యంత ప్రీతిపాత్రమైన ఆహారం మటన్ ఫ్రై, బటర్ చికెన్ అట. దాన్నే కోహ్లీ త్యాగం చేశాడు. కానీ ఆధునిక ఆట అవసరాలకోసం కోహ్లీ తన్ను తాను మల్చుకున్న విధానం అద్భుతమంటాడు శర్మ. మీరేం తింటారో దాని ప్రకారమే నీవు ఉంటావన్న పాత సామెతను కోహ్లీ అనుసరిస్తాడు.

కొన్ని కావాలంటే కొన్ని మానేయాల్సిందేగా అంటున్న కోహ్లి
హైదరాబాద్ , గురువారం, 19 జనవరి 2017 (07:09 IST)
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవ్వాళ మనకాలం వీరుడే కావచ్చు. క్రికెట్ వ్యాఖ్యాతలు ఫీల్డ్‌లో అతడి నైపుణ్యాన్ని వర్ణించేందుకు మాటలు వెతుక్కోవడం నిజమే కావచ్చు. భారీస్థాయిలో పరుగులు సాధించడం నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్‌కు నేతృత్వం వహించడం వరకు కోహ్లీ వ్యవహరించే తీరు ప్రజలను మూగవారిని చేసి అతడిపై ఆరాధనను కలిగించవచ్చు. 28 ఏళ్ల ప్రాయంలో ఉన్న కోహ్లీ బ్యాట్‌తోనే కాదు ఫిజికల్ ఫిట్‌నెస్‌లో కూడా తనకే సాధ్యమైన ప్రమాణాలను సాధిస్తూండవచ్చు. భారత క్రికెట్ టీమ్ మాజీ ట్రయినర్ శంకర్ బాసు అయితే టెన్నిస్ సూపర్ స్టార్ నోవోక్ జొకోవిక్ కంటే మంచి ఫిట్‌నెస్ కలవాడు కోహ్లీయే అని సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. 
 
కానీ తొలినాళ్లలో కోహ్లీ ఇలా ఉండేవాడు కాదన్నదీ వాస్తవమే. జూనియర్ క్రికెట్ రోజుల్లో కోహ్లీ కెరీర్‌ని గమనిస్తూవచ్చిన వారికి ఈ డిల్లీ క్రికెటర్ పార్కులో అంత గొప్ప ప్లేయర్‌గా ఉండేవాడు కాదని తెలుసు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే, తనలో పేరుకుపోయిన కొన్ని కిలోల అదనపు బరువును తగ్గించుకోవడానికి అతడెన్ని త్యాగాలు చేశాడన్నదే.  ఫిట్‌గా ఉండాలని, చాలాకాలంపాటు కెరీర్‌ను కొనసాగించాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం ఒక్కరాత్రిలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆహారాన్ని త్యాగం చేసేశాడు.
 
కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చెప్పినదాన్ని బట్టి అప్పట్లో కోహ్లీకి అత్యంత ప్రీతిపాత్రమైన ఆహారం మటన్ ఫ్రై, బటర్ చికెన్ అట. దాన్నే కోహ్లీ త్యాగం చేశాడు. కానీ ఆధునిక ఆట అవసరాలకోసం కోహ్లీ తన్ను తాను మల్చుకున్న విధానం అద్భుతమంటాడు శర్మ. మీరేం తింటారో దాని ప్రకారమే నీవు ఉంటావన్న పాత సామెతను కోహ్లీ అనుసరిస్తాడు. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంట్లో చేసిన తాజా భోజనమే స్వీకరించాలని ప్రజలకు సూచించాడు. తక్కువగా తినాల్సిన పనిలేదు. కానీ ఎంత తిన్నా ఇంటి బోజనమే తిను. ఏ రోజైనా అదే ఆరోగ్యకరమైన ఎంపిక అనేది తన సలహా. కానీ కఠినమైన విధానాలను పాటించడం ఏమంత సులభం కాదంటాడు కోహ్లి. 
 
2012లో ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. బంగ్లాదేశ్‌పై 180 పరుగులు చేశాడు. తర్వాత ఐపీఎల్‌లో పాలుపంచుకున్నాడు. అప్పుడే ఈ సీజన్ నాకు గొప్ప అనుభూతిని ఇవ్వనుందని  గ్రహించాడు. దాన్ని నా టోర్నమెంటుగా మార్చాలని, బౌలర్లను డామినేట్ చేయాలని తలచాను. దానికోసం చాలా కష్టపడ్డాను. ఆనాటి వరకు నా ట్రెయినింగ్ ఘోరంగా ఉండేది. నానా చెత్తా తినేవాడిని, చాలా ఆలస్యంగా నిద్రలేచేవాడిని, రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగేవాడిని, నా ఆలోచనలే భయంకరంగా ఉండేవి. ఇప్పటికన్నా పది పన్నెండు కిలోలు ఎక్కువ బరువు ఉండేవాడిని. ఒక్కసారి నాకేసి చూసుకున్నాను. ఆ మరుసటి దినమే నేను ప్రతిదీ నా తిండి పద్దతుల నుంచి శిక్షణ వరకు అన్నింటినీ మార్చుకున్నాను అని కోహ్లీ చెప్పాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ బాక్సర్ అమీర్ ఖాన్ బండారం బయటపడింది.. ఎక్స్-రేటెడ్ వీడియో లీక్..(video).