కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే టీవీకి అతుక్కుపోతా: పాకిస్థాన్ క్రికెట్ కోచ్

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ కోచ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ ఆటతీరుకు తాను అభిమాననని పాక్ చీఫ్ కోచ్, దక్షిణాఫ్రికా

శుక్రవారం, 14 అక్టోబరు 2016 (17:54 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ కోచ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ ఆటతీరుకు తాను అభిమాననని పాక్ చీఫ్ కోచ్, దక్షిణాఫ్రికా క్రికెటర్ మిక్కీ ఆర్థర్ వెల్లడించారు. కోహ్లీ ఆటతీరు అత్యద్భుతమని కితాబిచ్చారు.

కోహ్లీ అసాధారణ క్రికెటర్ అని.. అతడి బ్యాటింగ్‌కు వస్తున్నాడంటేనే తాను టీవీకి అతుక్కుపోతానని చెప్పారు. రెండేళ్ల క్రితం అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ కొట్టిన 141 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మరిచిపోనని ఆర్థర్ అన్నారు. ఆ ఇన్నింగ్స్ తనకు ఇప్పటికీ అలాగే గుర్తుందని చెప్పుకొచ్చారు.
 
ఇక పాకిస్థాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడంపై ఆర్థర్ మాట్లాడుతూ.. భారత్‌ వెనక్కి నెట్టి పాకిస్థాన్‌ను టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టేందుకు ఆర్థర్ కృషి చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. ర్యాంకింగ్స్‌ను గురించి పట్టించుకోనని, ఒక జట్టుకు విజయమే ప్రధానమని చెప్పారు.

ప్రతి క్రికెటరూ.. బెటర్ అండ్ బెటర్‌గా ఆడేందుకు ప్రయత్నించాలన్నారు. పాకిస్థాన్ జట్టుకు కోచింగ్ ఇవ్వడం సంతృప్తికరంగా ఉందని, యువ క్రీడాకారులతో పనిచేయడం బాగుందని, తన సూచనల మేరకు పాక్ క్రికెటర్లు మెరుగ్గా ఆడుతున్నారని ఆర్థర్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బీఎండబ్ల్యూ కారుకు బదులు సొమ్ము ఇస్తారట.. థ్యాంక్స్.. దీపా కర్మాకర్