ప్రపంచ కప్ సెమీఫైనల్ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో అరేబియా సముద్ర తీరాన ముంబై వాంఖెడే స్టేడియంలో భారత్ వరల్డ్ కప్ సెమీస్ ఆడుతోంది. ఇక వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీ.. సెమీఫైనల్‌లో రాణించడం ద్వారా మూడు సచిన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
గతవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో సెంచరీ బాదిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వీళ్లిద్దరూ 49 వన్డే సెంచరీలు చేసి ఉన్నారు. ఈ మ్యాచులో మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.
అలాగే సచిన్ 673 ప్రపంచ కప్ పరుగుల రికార్డును బ్రేక్ చేసేందుకు కూడా కోహ్లీ సిద్ధంగా వున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 594 పరుగులతో ఉన్నాడు.