Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మదమెక్కిన మగాళ్లు లైంగికదాడి చేస్తుంటే.. పిరికిపందల్లా చూసిన వాళ్లు పురుషులా? ఛీ...: విరాట్ కోహ్లీ

బెంగుళూరులో సామూహిక లైంగిక వేధింపుల ఘటనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదమెక్కిన మృగాళ్లు మహిళలపై దాడులకు పాల్పడుతుంటే పిరికిపందల్లా చూసిన వాళ్లకి.. మగాళ్లని

మదమెక్కిన మగాళ్లు లైంగికదాడి చేస్తుంటే.. పిరికిపందల్లా చూసిన వాళ్లు పురుషులా? ఛీ...: విరాట్ కోహ్లీ
, శనివారం, 7 జనవరి 2017 (12:48 IST)
బెంగుళూరులో సామూహిక లైంగిక వేధింపుల ఘటనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదమెక్కిన మృగాళ్లు మహిళలపై దాడులకు పాల్పడుతుంటే పిరికిపందల్లా చూసిన వాళ్లకి.. మగాళ్లని చెప్పుకునే హక్కులేదని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇలాంటి సమాజంలో తానూ ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్టు వ్యాఖ్యానించాడు. 
 
డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన ఘటనపై కోహ్లీ ఆలస్యంగా స్పందించాడు. ఇదే అంశంపై అతను ఓ ట్వీట్ చేశాడు. 'బెంగళూరులో జరిగిన ఘటనలు ఎంతో కలచి వేశాయి. ఓ అమ్మాయిపై దాడి జరుగుతుంటే.. ప్రేక్షకుల్లా చూడటం పిరికిపంద చర్య. అసలు వాళ్లకు మగాళ్లని చెప్పుకునే హక్కులేద’ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సందేశంలో విరాట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మీ కుటుంబంలోని వారిపై ఇలాంటి అఘాయిత్యానికి బరితెగిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని సూటిగా ప్రశ్నించాడు. అడ్డుకునే వారు లేరనే ధైర్యంతోనే అరాచక మూకలు పేట్రేగి పోతున్నాయని కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కురచ దుస్తులు ధరించిన కారణంగానే ఇదంతానా..! ఆమె జీవితం.. ఆమె ఇష్టం. పురుషులు దానిని ఒప్పుకోవాలి. కానీ అధికారంలో ఉన్న వారి వ్యాఖ్యలు భయానకమ’ని కోహ్లీ అన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెప్టెన్సీని త్యజించేలా ధోనీతో వ్యవహరించారు.. జట్టు సభ్యులు కూడా...