Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిఖర్ ధావన్‌పై బెంగాల్ దాదా ఫైర్.. ఐపీఎల్ ఫైనల్లోనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలి!

Advertiesment
శిఖర్ ధావన్‌పై బెంగాల్ దాదా ఫైర్.. ఐపీఎల్ ఫైనల్లోనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలి!
, శనివారం, 28 మే 2016 (19:02 IST)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ 9వ సీజన్‌లో శిఖర్ ధావన్ రాణించకపోవడంపై గంగూలీ మండిపడ్డాడు.

ఇకనైనా శిఖర్ ధావన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలని.. నిర్లక్ష్యం ఆడటాన్ని వదిలిపెట్టాలన్నాడు. అనవసరంగా వికెట్ పారేసుకోవడం మాని ఆడే విధానంలో మార్పులు తెచ్చుకోవాలని సూచించాడు. 
 
అంతేగాకుండా హైదరాబాద్ ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో చివరి పోరులోనైనా శిఖర్ ధావన్ మేలుకుని మెరుగ్గా రాణించాలని క్లాస్ పీకాడు. టీమిండియాకు ధావన్ కీలకమైన బ్యాట్స్ మన్ అని, ఐపీఎల్‌లో ఆ జట్టుకు కూడా ధావన్ కీలకమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పాడు.

ఫస్ట్ క్వాలిఫయర్, సెకెండ్ క్వాలిఫయర్‌లో ధావన్ సరిగా ఆకట్టుకోలేక పోయాడని ఫైనల్లో డేవిడ్ వార్నర్‌కు అండగా నిలబడతాడని ఆశిస్తున్నట్లు గంగూలీ వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జికా వైరస్ వ్యాప్తి.. రియో ఒలింపిక్స్ వేదిక మార్చాలన్న నిపుణులు.. నో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ!