సాగరతీరం విశాఖపట్టణం తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి టోర్నీ మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఈ మ్యాచ్ ఆతిథ్యం వైజాగ్‌కు దక్కింది. దీంతో విశాఖపట్నంలో తొలి పోరు ఆదివారం జరుగనుంది.
స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గత సీజన్లలో హైదరాబాద్‌కు సొంత మైదానంగా నిలిచిన వైజాగ్ స్టేడియం ఈ సారి ముంబైకి హోమ్ గ్రౌండ్‌గా మారడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకూ కీలకంగా మారనుంది. చెరో ఐదు విజయాలతో పది పాయింట్లతో ఉన్న ముంబై, రైజర్స్ ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నాయి. ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా, రైజర్స్ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 42 సీసీ కెమెరాలు అమర్చారు.