సెల్ఫీ కోసం ఛేజింగ్... ధోనీతో ఫొటో కోసం అభిమాని ఆరాటం... నిరాశపరచని మహీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం ప్రతి ఒక్కరూ ఎగబడుతుంటారు. మరికొందరైతే అవకాశం లభిస్తే సెల్ఫీతో తీసుకునేందుకు ఆరాటపడతారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం ప్రతి ఒక్కరూ ఎగబడుతుంటారు. మరికొందరైతే అవకాశం లభిస్తే సెల్ఫీతో తీసుకునేందుకు ఆరాటపడతారు.
రాంచీ మహిళా కళాశాలకు చెందిన ఆరాధ్య అనే ఓ యువతికి కూడా ఇలాంటి అవకాశమే దక్కింది. కాకపోతే సెల్ఫీకోసం ఆమె కొంచెం వెరైటీగా ప్లాన్ చేసింది. స్వయానా ధోనీ డ్రైవ్ చేస్తున్న కారును ఛేజ్ చేసి మరీ అతనితో సెల్ఫీ తీసుకుంది.
న్యూజిలాండ్‌తో రాంచీలో నాలుగో వన్డే సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం ధనాధన్ ధోనీ తన హమ్మర్ కారులో ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. స్వయానా డ్రైవ్ చేసుకుంటూ దూసుకెళ్తున్న మహీని చూసిన ఆరాధ్య అనే అభిమాని సెల్ఫీ కోసం ఆ కారును వెంబడించింది.
తన స్కూటీపై దారిమధ్యలోనే కారును దాటేసింది. ఎయిర్‌పోర్టు వరకు అలానే వెళ్లింది. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెర్మినల్ వద్ద ధోనీని కలిసింది. తన సెల్ఫీ కోరిక గురించి అతనితో చెప్పింది. ఇంకేముంది.. తన అభిమానిని ఏమాత్రం నిరాశపరచకుండా ధోనీ ఆమెతో సెల్ఫీ దిగాడు. తన ఫేవరెట్ క్రికెటర్‌తో క్లిక్‌మనిపించిన సెల్ఫీని ఆ తర్వాత ఆరాధ్య సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ముచ్చట తీర్చుకుంది.