Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యకుమార్ భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?

సూర్యకుమార్ భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
, గురువారం, 18 నవంబరు 2021 (08:29 IST)
Surya
ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. జైపూర్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 62 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే సూర్యకుమార్‌ను 57 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‎ను ట్రెంట్ బౌల్ట్ విడిచిపెట్టాడు. దీనిపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. 
 
తన ముంబై ఇండియన్స్ సహచరుడు తన భార్య పుట్టినరోజున తన భార్యకు ఇచ్చిన బహుమతి అని చమత్కరించాడు. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 3 సిక్సర్లు, 6 బౌండరీలతో 62 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
 
చివర్లో ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, కెప్టెన్ టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియా తడబడింది. బౌల్ట్ వేసిన 16 ఓవర్‎లో సూర్యకుమార్ ఔట్ కావటంతో ఇండియా కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 8 బంతుల్లో 5 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ సౌథీ బౌలింగ్‎లో వెనుదిరిగాడు. మొదటి మ్యాచ్ అడుతున్న వెంకటేష్ అయ్యర్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఒత్తిడిలో పడింది. కానీ వికెట్ కీపర్ రిషభ్ పంత్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి మ్యాచ్ గెలిపించాడు.
 
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ గుప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. మార్క్ చాప్‌మన్ 50 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఒక దశలో బ్లాక్ క్యాప్స్ 180 పరుగులు చేసేలా కనిపించింది. కానీ స్పిన్నర్ రవిచంద్రన్ వేసిన 14వ ఓవర్‎లో చాప్‌మన్, ఫిలిప్స్ ఔట్ కావటంతో కివీస్ కాస్త ఒత్తిడిలో పడింది. 
 
ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు. 165 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో విజయం సాధించింది. రోహిత్ శర్మ 36 బంతుల్లో 48 పరుగులు చేశాడు. మొదటి టెస్ట్‌కు విశ్రాంతి తీసుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ నంబర్ .3 వద్ద బ్యాటింగ్ చేసే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవా ఎన్నికల బరిలో లియాండ్ పేస్?