Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీకి తానా అంటున్న సచిన్.. ఇక రవిశాస్త్రి కోచ్‌గా పగ్గాలు పట్టడమే తరువాయి..!

ఎవరూ ఊహించని విధంగా టీమిండియా కోట్ పదవికి చివరి నిమిషంలో రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోవడానికి వెనుక సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. టీమిండియా కోచ్ పదవి ఇస్తే తీసుకుంటాను.. కానీ, దాని కోసం క్యూ లైన్లో నిల్చోను’ అని లండన్‌లో హాలీడే ట్రిప్ ఎంజ

Advertiesment
Virat Kohli  Tendulkar convinces Shastri  Team India coach  Sachin Tendulkar  Ravi Shasrti  Anil Kumble
హైదరాబాద్ , గురువారం, 29 జూన్ 2017 (01:29 IST)
ఎవరూ ఊహించని విధంగా టీమిండియా కోట్ పదవికి చివరి నిమిషంలో రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోవడానికి వెనుక సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. టీమిండియా కోచ్ పదవి ఇస్తే తీసుకుంటాను.. కానీ, దాని కోసం క్యూ లైన్లో నిల్చోను’ అని లండన్‌లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న శాస్త్రి ఇంతకుముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. కానీ, తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకొని దరఖాస్తు చేసుకోవడానికి దిగొచ్చాడు. సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని అతడితో మాట్లాడటం వల్లే ఇది సాధ్యమైందని సమాచారం. 
 
టీమిండియాకు మరోసారి నష్టం జరిగే పరిణామాలను సచిన్ చూస్తూ ఉండలేకపోయాడట. భారత జట్టుకు మేలు జరగాలంటే.. రవిశాస్త్రి లాంటి వ్యక్తి కోచ్ పగ్గాలు అందుకోవాలి, అదే సమయంలో ఎంపిక ప్రక్రియ కూడా ఒక పద్ధతి ప్రకారమే జరగాలని సచిన్ భావించాడట. అందుకే ప్రత్యేకంగా చొరవ తీసుకొని, రవిశాస్త్రికి ఫోన్ చేసి అంగీకరింపజేశాడు. ఇక క్రికెట్లో దేవుడిగా భావించే సచినే స్వయంగా రంగంలోకి దిగాక రవిశాస్త్రి అంగీకరించకుండా ఉంటాడా..!
 
గతేడాది కుంబ్లేతో పాటు రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలోనూ సచిన్ టెండూల్కర్.. కోచ్ పదవికి రవిశాస్త్రి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే, కుంబ్లే కోసం గంగూలీ గట్టిగా పట్టుబట్టడం.. దానికి లక్ష్మణ్ కూడా మద్దతు తెలపడంతో టీమిండియా కోచ్ పదవి పగ్గాలను అనిల్ కుంబ్లే అందుకున్నాడు. బీసీసీఐ సలహా సంఘంలో సభ్యులుగా ఉన్న సచిన్, గంగూలీ, లక్ష్మణ్.. ఈ ముగ్గురూ కోచ్ ఎంపిక విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉండగా కోహ్లీ కూడా కోచ్ పదవికి రవిశాస్త్రినే ఎంపిక చేయాలని గట్టిగా కోరుకుంటున్నాడు. టీమిండియా డైరెక్టర్‌గా, కామెంటేటర్‌గా మంచి పేరున్న ఈ మాజీ క్రికెటర్ కోచ్‌గానూ సత్తా చాటుతాడని, జట్టు సభ్యులకూ అతడంటే చాలా గౌరవమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంతానికి పోయి ఇప్పుడు దరఖాస్తు చేసుకోకపోతే.. మరోసారి రవిశాస్త్రికి నిరాశే ఎదురవుతుందని భావించిన సచిన్ తానే నేరుగా రంగంలోకి దిగాడు. 
 
మరో రెండేళ్లలో వరల్డ్ కప్ టోర్నీ ఎదుర్కోనున్న భారత క్రికెట్ జట్టుకు రవిశాస్త్రి అయితేనే సరైన మార్గనిర్దేశం చేయగలడని సచిన్ భావిస్తున్నాడు. 2015లో ప్రపంచ కప్ సమయంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి సెమీపైనల్లోనే భారత్ చతికిలపడుతుంటే చూస్తుండిపోయాడు. ఇప్పుడు మళ్లీ ప్రధాన కోచ్‌గా వచ్చి తాను పొడిచేమేటో మరి. భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు స్వార్థ పరులు రవిశాస్త్రి, సచిన్ వీళ్లిద్దరూ కలిసి మరొక పచ్చి అహంభావికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. భారత క్రికెట్ భవిష్యత్తు ఏమవుతుందో మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ క్రికెట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా కోహ్లిది.. బలిపశువును చేయవద్దు