Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షఫాలీ వర్మకు షాక్ .. ఆరు రోజుల్లో అగ్రస్థానం అవుట్

Advertiesment
Shafali Verma
, సోమవారం, 9 మార్చి 2020 (17:59 IST)
భారత మహిళల క్రికెట్ జట్టులో బ్యాటింగ్ సెన్సేషన్ షఫాలీ వర్మకు తేరుకోలోని షాక్ తగిలింది. కేవలం ఒక్క రోజులేనే టాప్ 19 స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకింది. ఎంత వేగంగా మొదటి స్థానాన్ని దక్కించుకుందో అంతే వేగంగా ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ మహిళల ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో షఫాలీ వర్మ కేవలం రెండు పరుగులకే ఔట్ అయింది. దీంతో ఆమె ర్యాంకు అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. అంటే కేవలం ఆరు రోజుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానంలో నిలిచింది. 
 
టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో భారత జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితంగా గత బుధవారం బుధవారం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ, ఫైనల్లో కేవలం రెండు పరుగులకే ఔట్ కావడంతో షఫాలీ ర్యాంక్‌ను దెబ్బతీసింది. 744 రేటింగ్‌ పాయింట్లతో ఆమె ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. 
 
అదేసమయంలో ఫైనల్లో టాప్‌ స్కోరర్‌‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఓపెనర్‌‌ బెత్‌ మూనీ 762 పాయింట్లతో మూడు నుంచి ఒకటో ర్యాంక్‌కు దూసుకొచ్చింది. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా మూనీ తన కెరీర్‌‌లో తొలిసారి నంబర్‌‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది. న్యూజిలాండ్‌ క్రికెటర్ సుజీ బేట్స్ (750) రెండో ర్యాంక్‌లో మార్పులేదు.
 
ఇకపోతే, ఐసీసీ తాజా ర్యాంకుల్లో భారత క్రికెటర్లు స్మృతి మంథా, జెమీమా రోడ్రిగ్స్‌‌లు టాప్-10లో చోటుదక్కించుకున్నారు. ప్రపంచకప్‌లో నిరాశ పరిచిన మంథాన ఆరు నుంచి ఏడో ప్లేస్‌కు పడిపోగా, జెమీమా రోడ్రిగ్స్‌ తొమ్మిదో స్థానంలో మార్పు లేదు. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌ వరుసగా 6,7,8 స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌ బౌలర్‌‌ సోఫీ ఎకిల్‌స్టోన్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైదానంలో బోరున ఏడ్చేసిన టీనేజ్ ఓపెనర్