Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి బంతిని స్ట్రెయిట్ సిక్సర్ గా మలచాలని ఉండేది.. సెహ్వాగ్ చేసి చూపాడు: గవాస్కర్

టెస్టుల్లో తొలి బంతిని స్ట్రెయిట్ సిక్సర్గా మలచాలని ఎప్పుడూ తాపత్రయ పడేవాడిని. ఓసారి ఈ ఫీట్ సాధించాను. కానీ సెహ్వాగ్ మాత్రం చాలాసార్లు ఇలాంటి ఫీట్లను మన ముందు ఆవిష్కరించాడు అంటూ భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు.

Advertiesment
Sunil Gavaskar
హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (03:09 IST)
టెస్టుల్లో తొలి బంతిని స్ట్రెయిట్ సిక్సర్గా మలచాలని ఎప్పుడూ తాపత్రయ పడేవాడిని. ఓసారి ఈ ఫీట్ సాధించాను. కానీ సెహ్వాగ్ మాత్రం చాలాసార్లు ఇలాంటి ఫీట్లను మన ముందు ఆవిష్కరించాడు అంటూ భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. తన పుస్తకం 'సన్నీ డేస్' 40 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గవాస్కర్ మరిన్ని విషయాలను ప్రస్తావించారు. పుణెలో స్పోర్ట్స్ లిటరరీ ఫెస్టివల్ లో భాగంగా మాట్లాడుతూ.. 'వీరేంద్ర సెహ్వాగ్, నా బ్యాటింగ్ శైలి ఒకే తీరుగా ఉండేది. సెహ్వాగ్ తాను అనుకున్నట్లుగా బంతిని పవర్ ఫుల్‌గా బాదేవాడు. నాకు కూడా సెహ్వాగ్ లాగే బ్యాటింగ్ చేయాలని ఉండేది. బ్యాటింగ్‌లో గట్స్ ఉన్న భారత క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకడు. టెస్టుల్లో తొలి బంతిని స్ట్రెయిట్ సిక్సర్ గా మలచాలని ఎప్పుడూ తాపత్రయ పడేవాడిని. ఓసారి ఈ ఫీట్ సాధించాను. కానీ సెహ్వాగ్ మాత్రం చాలాసార్లు ఇలాంటి ఫీట్లను మన ముందు ఆవిష్కరించాడు. అని గవాస్కర్ కొనియాడాడు. 
 
తన లక్ష్యాలను, ఆశయాలను  విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు సాధిస్తుందని  గవాస్కర్ అన్నారు. టెస్టుల్లో వరుస విజయాలతో జట్టు దూసుకెళ్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోహ్లీ కెప్టెన్సీలోని ప్రస్తుత జట్టు మరిన్ని అద్బుతాలు  చేస్తుందన్నారు. ట్వంటీ20 ఫార్మాట్‌తో క్రికెట్‌కు ఎలాంటి నష్టం లేదు. ఆటకు ట్వంటీ20లు ఎంతో మేలు చేశాయి. ఏది ఏమైనా ఆటగాడి నైపుణ్యాన్ని చెప్పాలంటే టెస్టు గణాంకాలను ఆధారంగా తీసుకోవాలి' అని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా.. పూణే టెస్టు.. తొలి రోజు స్కోర్ 256/9