సునీల్ గవాస్కర్‌కు అవమానం: స్టేడియంలోకి వెళ్ళనివ్వలేదు.. అరగంట నిల్చోబెట్టారు
అమెరికాలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌కు అవమానం జరిగింది. స్టేడియంలోకి వెళ్ళనివ్వకుండా భద్రతా సిబ్బంది ఆయనను అరగంట పాటు అలానే నిల్చోబెట్టారు. ఈ ఘటనపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అమెర
అమెరికాలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌కు అవమానం జరిగింది. స్టేడియంలోకి వెళ్ళనివ్వకుండా భద్రతా సిబ్బంది ఆయనను అరగంట పాటు అలానే నిల్చోబెట్టారు. ఈ ఘటనపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో గల స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో ట్వంటీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కామెంటేటర్ బృందంలో సునీల్ గవాస్కర్‌కు చోటుంది.
వ్యాఖ్యతగా వ్యవహరించేందుకు స్టేడియంకు చేర్చుకున్న సన్నీని భద్రతా సిబ్బంది లోపలికి పంపేందుకు నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా సునీల్ గవాస్కర్‌ను అరగంట పాటు నిలబెట్టేశారు. అరగంట గడిచినా స్టేడియంలోకి పంపేందుకు భద్రతా సిబ్బంది యోచించినట్లు వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే భద్రతాపరంగా చాలా కఠినంగా వ్యవహరించే అమెరికా.. ప్రముఖుల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించే విషయం తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన షారూఖ్ ఖాన్‌కు కూడా లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో నిల్చోబెట్టిన సంగతి తెలిసిందే.