Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కటక్ బారామతిపై రెండేళ్ళ నిషేధం విధించాలి : సునీల్ గవాస్కర్

Advertiesment
Sunil Gavaskar calls for Cuttack ban after crowd trouble
, బుధవారం, 7 అక్టోబరు 2015 (10:05 IST)
కటక్‌లోని బారామతి క్రికెట్ స్టేడియంలో రెండేళ్ళ పాటు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధించాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఒడిషా క్రికెట్ సంఘం మండిపడింది. ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారని ఓసీఏ కార్యదర్శి ఆసిర్బాత్‌ బెహెరా ప్రశ్నించారు. 
 
సఫారీలు ఆరు వికెట్లతో నెగ్గిన ఈ మ్యాచ్‌లో ధోనీసేన 92 పరుగులకే కుప్పకూలడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు మైదానంలోకి వాటర్‌ బాటిళ్లు విసిరి ఆటకు అంతరాయం కలిగించిన విషయంతెలిసిందే. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ స్టేడియంలో రెండేళ్ల పాటు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లూ జరగకుండా నిషేధం విధించాలని కోరాడు. 
 
ప్రేక్షకులకు అక్కడి పోలీసులు ఎలాంటి సూచనలూ చేయలేదు. బౌండ్రీ చుట్టుపక్కల మోహరించిన సిబ్బంది మ్యాచ్‌ చూడకుండా.. అభిమానుల అల్లరిని నియంత్రించాల్సి ఉంటుంది. కానీ వారు ఆ పని చేయలేదు. కటక్‌కు రెండేళ్ల పాటు ఎలాంటి మ్యాచ్‌నూ కేటాయించొద్దు. అలాగే ఒడిశా క్రికెట్‌ సంఘానికి అందించే సబ్సిడీని బీసీసీఐ నిలిపివేయాలని డిమాండ్‌ చేశాడు. 
 
కాగా, స్టేడియంపై రెండేళ్ల నిషేధం విధించాలన్న సునీల్‌ గవాస్కర్‌ డిమాండ్‌ను ఒడిశా క్రికెట్‌ సంఘం (ఓసీఏ) తప్పుపట్టింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం సన్నీకి లేదని పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌ వేదికపై నిర్ణయం తీసుకునే అధికారం గవాస్కర్‌కు లేదు. ఆయన కేవలం వ్యాఖ్యాత మాత్రమేన ఓసీఏ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu