ఆసియా క్రికెటో టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక పోరు శ్రీలంకలో జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ బుధవారం ధ్రువీకరించాడు. గురువారం డర్బన్‌లో జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ జాకా అప్రాఫ్ కలిసి భారత్, పాక్ మ్యాచ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ధుమాల్ తెలిపాడు.
'పీసీబీ చైర్మన్ అష్రాఫ్‌ను మా కార్యదర్శి కలిశాడు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. ముందు అనుకున్నట్లే టోర్నీ కొనసాగుతుంది. లీగ్ దశలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. భారత్, పాక్ మ్యాచ్ సహా తొమ్మిది మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. ఇరు జట్లు ఫైనల్ చేరుకుంటే లంకలోనే తుదిపోరు జరుగుతుంది. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో భారత్ పర్యటిస్తుంందన్న కథనాల్లో నిజం లేదు. అలాంటి చర్చే జరగలేదు. భారత్, మా కార్యదర్శి పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. షెడ్యూల్ మాత్రమే ఖరారైంది' అని ధూమల్ వివరించాడు.