Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ రికార్డు స్కోరు - రికార్డుల హోరు

Advertiesment
Abhishek Sharma

ఠాగూర్

, ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (12:01 IST)
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా, శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును తన పేరును రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లతో అభిషేక్ 141 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన తొలి భారతీయుడుగా రికార్డులకెక్కారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలివుండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని ఐపీఎల్‌లోని ఇది రెండో అత్యధిక ఛేజింగ్ కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఇండియన్‌గానూ అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. అలాగే, ఈ ఐపీఎల్‌లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. పదో ఓవర్లో పంజాబ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ వేసిన బంతిని 106 మీటర్ల దూరం పంపి రికార్డులకెక్కాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ హెల్మెట్‌ను అలా వాడుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (వీడియో)