బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై మాటెత్తారు. పాకిస్థాన్‌తో క్రికెట్ తమ పరిధిలో లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనని గంగూలీ స్పష్టం చేశారు.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు ముంబైపై ఉగ్రదాడుల తర్వాత తెగిపోయిన నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య క్రికెట్ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి వుందని గంగూలీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు.
కానీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు త్వరలోనే బలపడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పీసీబీలో చేరి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాగా.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ముంబై పేలుళ్ల అనంతరం టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ సిరీస్‌లు జరగట్లేదు.