Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగూలీ తలకు గన్ గురిపెట్టాడు.. కానీ అదృష్టం బాగుండి.. ఓ అమ్మాయి వచ్చింది..

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తలకు ఒకడు గన్ గురిపెట్టాడని తెలిస్తే షాకవుతారు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు గంగూలీనే. తాను రాసిన పుస్తకంలోని ''ట్రబుల్స్ ఇన్ ఇంగ్లండ్'' అనే చాప్టర్‌లో ఉన్న విష

Advertiesment
Shocking! Sourav Ganguly could have been shot dead in his first tour to England
, శుక్రవారం, 30 డిశెంబరు 2016 (13:00 IST)
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తలకు ఒకడు గన్ గురిపెట్టాడని తెలిస్తే షాకవుతారు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు గంగూలీనే. తాను రాసిన పుస్తకంలోని ''ట్రబుల్స్ ఇన్ ఇంగ్లండ్'' అనే చాప్టర్‌లో ఉన్న విషయాన్ని మాజీ కెప్టెన్ తెలిపాడు. తాను మొదటిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాననే సంతోషం కంటే అప్పుడు ఎదుర్కొన్న భయానక ఘటనే తనకు ఎక్కువగా గుర్తుందని తెలిపాడు 
 
తాను 1996లో తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన సందర్భంలో అప్పుడు టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లాను. సిరీస్ మధ్య ఓసారైనా తన బంధువులను కలిసేందుకు కావెండిష్‌ నుంచి పిన్నార్‌కు లండన్‌ అండర్‌గ్రౌండ్‌ ట్రెయిన్‌ (ట్యూబ్‌)లో ప్రయాణించాను. ఆ సమయంలో తనతో పాటు మరో క్రికెటర్‌ సిద్ధూ కూడా ఉన్నాడు. తాము కూర్చున్న క్యారేజ్‌లో ఐదుగురు టీనేజర్లు ఉన్నారు. వారిలో ఒకడు బీరు తాగి ఖాళీ క్యాన్‌ను మాపై విసిరేశాడు. ఆ సమయంలో తాను క్యాన్ పక్కనపెట్టి వారిని పట్టించుకోలేదని.. కానీ సిద్ధూ మాత్రం కోపంతో ఊగిపోయాడు.
 
తాను సిద్ధూని వారిస్తుండగా ఆ కుర్రాడు మాటల దాడి చూస్తూ మాపైకి వచ్చాడు. దీంతో తాను కూడా సిద్ధూకి జతకలిశానని, ఇంతలో ఆ కుర్రాడు ఒక్కసారిగా తన వద్ద ఉన్న గన్ తీసి తన తలకు గురిపెట్టాడని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే తన జీవితం అయిపోతుందని అనుకున్నా. ఆ సమయంలో అమ్మానాన్న, ఫ్రెండ్స్, క్రికెట్ గుర్తొచ్చాయి. కానీ తన అదృష్టం బాగుండి ఆ బృందంలోని ఒక అమ్మాయి వచ్చి ఆ కుర్రాడిని పక్కను నెట్టేసింది. ఇంతలో స్టేషన్ రావడంతో వాళ్లు దిగిపోయారని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్కతో నిశ్చితార్థమా.. అవన్నీ ఉత్తుత్తివే.. న్యూస్ ఛానెళ్లు ఇక ఆపండి..