దావూద్ ఇబ్రహీంకు కోపమొచ్చింది.. షాహిద్ అఫ్రిదికి అవమానం.. ఎలా..?
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన షాహిద్ అఫ్రిదీకి చుక్కెదురైంది. ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీకి రాజీనామా చేయడం ప్రస్తుతం ఆతని పాలిట శాపంగా మారింది. అంతేగాకుండ
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన షాహిద్ అఫ్రిదీకి చుక్కెదురైంది. ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీకి రాజీనామా చేయడం ప్రస్తుతం ఆతని పాలిట శాపంగా మారింది. అంతేగాకుండా అఫ్రిదీ దేశద్రోహి అంటూ వెటరన్ జావెద్ మియాందాద్ ఘాటైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అఫ్రిదీ కూడా మియాందాద్ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చాడు.
అయితే తన వియ్యంకుడిపై విమర్శలు చేయడంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కోపం తెచ్చిపెట్టింది. దీంతో పాకిస్థాన్‌లో దేనినైనా ప్రభావితం చేయగల దావూద్ పీసీబీని ప్రభావితం చేశాడు. దీంతో ఒక్కసారిగా జట్టులో చోటు కోల్పోవడమే కాకుండా, సీనియర్ క్రికెటర్‌గా అందాల్సిన కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అంతేగాకుండా ర్యాంకుల్లో అఫ్రిదీకి చోటుదక్కలేదు.
ఫలితంగా షాహిద్ అఫ్రిదిని తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలగించింది. గత కొన్నేళ్లుగా ఏ-కేటగిరీలో కొనసాగిన అఫ్రిది ఒకేసారి చోటుకోల్పోవడం విశేషం. అంతేగాకుండా సీ-కేటగిరీలో అఫ్రిదీకి చోటు కల్పించి.. ఆతడిని అవమానించింది.