Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

షఫాలీ వర్మ అదుర్స్.. టీ-20లో అగ్రస్థానం..

Advertiesment
Shafali Verma
, బుధవారం, 24 మార్చి 2021 (10:20 IST)
మహిళల టీ20 ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మహిళల టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత టీనేజర్‌ షఫాలీ వర్మ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షఫాలీ 750 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. 
 
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టి20ల్లో షఫాలీ 23, 47 పరుగులతో రాణించింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న బెత్‌మూనీ (ఆస్ట్రేలియా) 748 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాకౌట్‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన షఫాలీ.. అప్పుడు తొలిసారి టాప్‌ ర్యాంకు అందుకుంది.
 
15 ఏళ్ల వయసులో భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా షఫాలీ వర్మ ఖాతాలో రికార్డు వుంది. షఫాలీ 15 సంవత్సరాల 239 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించింది. అనతికాలంలోనే భారత జట్టుకు కీలక ప్లేయర్‌గా మారింది. 
 
బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి స్మృతి మంధన ఏడో స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్‌ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ, రాధా యాదవ్‌ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం