Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సానియా నెం.1 ర్యాంక్ భారత్‌కే కాదు... పాకిస్థాన్‌కూ గర్వకారణం!

Advertiesment
sania mirza
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (12:10 IST)
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌తో చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సొంత దేశం భారత్‌కే కాదు, అత్తగారిల్లు పాకిస్థాన్‌కూ గర్వకారణమంటున్నాడు ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్. స్విస్ వెటరన్ స్టార్ హింగిస్‌తో కలిసి సానియా.. ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో విజేతగా నిలిచి వరల్డ్‌నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో సానియా ప్రదర్శనను చూసి తాను చాలా గర్వపడుతున్నాని తెలిపాడు. ఆమె భారతదేశానికి ప్రాతినిథ్యం వస్తున్నప్పటికీ.. తన భార్య కావడం వల్ల ఇది పాకిస్థాన్ గౌరవానికి కూడా సంబంధించిన అంశమేనని చెప్పాడు. 
 
సానియా విజయం యువ అభిమానులకు ప్రేరణ ఇస్తుందని, తన భార్య గెలుపొందిన తరువాత సియోల్ కోటలో కుటంబ సభ్యులతో వేడుక జరుపుకున్నానని వెల్లడించాడు. సానియాను వివాహం చేసుకోకముందు టెన్నిస్ అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు తన హృదయమంతా నిజంగా అదే నిండి ఉందని చెప్పుకొచ్చాడు. భార్య ఆడుతున్న సమయంలో తానెపప్పుడు ఉండను కాబట్టి మిస్ అవుతున్నానన్న కారణంతో తన మ్యాచ్‌లు ఎప్పుడూ చూస్తుంటానని షోయబ్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu