Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవకాశమిస్తే చాలు ఆసీస్ అమాంతంగా కబళించేస్తుంది: టీమిండియాకు సచిన్ వార్నింగ్

త్వరలో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత్ క్రికెట్ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తీవ్రంగా హెచ్చరించాడు. స్మిత్ నేతృత్వంలోని ఆసిస్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని, కాస్త అవకాశం ఇస్తే చాలు వారు ఇక మిమ్మల్ని కోలుకోనివ్వరని సచిన్ పేర్కొన్నాడు. ఆసీస్‌తో తలపడ

అవకాశమిస్తే చాలు ఆసీస్ అమాంతంగా కబళించేస్తుంది: టీమిండియాకు సచిన్ వార్నింగ్
హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (07:22 IST)
త్వరలో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత్ క్రికెట్ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తీవ్రంగా హెచ్చరించాడు. స్మిత్ నేతృత్వంలోని ఆసిస్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని, కాస్త అవకాశం ఇస్తే చాలు వారు ఇక మిమ్మల్ని కోలుకోనివ్వరని సచిన్ పేర్కొన్నాడు. ఆసీస్‌తో తలపడాలంటే ముందు డైనింగ్ టేబుల్ వద్ద సమయాన్ని తగ్గించి కాస్త జిమ్‌లో ఎక్కువ సమయం గడపాలని సూచించాడు. ప్రస్తుతం విజయానందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు సచిన్ సరైన సమయంలో ఆసీస్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించాడు. 
 
ఆ ఇద్దరి ఆట చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నాను.
టెన్నిస్ దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్‌-నడాల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో తలపడే సమయంలో పొందిన అనుభూతిని తాను ఒక క్రీడాకారునిగా అర్థం చేసుకోగలనని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు.  ఇద్దరు దిగ్గజ ప్లేయర్ల పరిస్థితిని తనకు అన్వయించుకోవచ్చని చెప్పుకొచ్చాఫైనల్‌ మ్యాచ్‌ను పూర్తిగా చూడలేకపోయానని కానీ కొద్దికొద్దిగానే చూసినా వాళ్ల ఇద్దరి మధ్య నెలకొన్న ఉద్విగ్నభరిత పరిస్థితిని అర్థం చేసుకోగలనని చెప్పాడు. తుదిపోరులో ఫెడరర్‌ ఐదుసెట్లపాటు పోరాడి నడాల్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. 
 
‘నా కెరీర్‌లో చాలాసార్లు గాయాలపాలయ్యా. కొన్ని గడ్డు పరిస్థితులనెదుర్కొన్నా. మీరెప్పుడు రిటైరవుతారంటూ 2005-06 సమయంలో ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నాకో ప్రశ్న ఎదురైంది. ఆ తర్వాత బ్యాట్‌తోనే సమాధానం చెప్పాను. నా జీవితంలో మరచిపోలేని అనుభవాలు ఆ తర్వాతే జరిగాయి. అయితే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఆడేటప్పుడు ఫెడరర్‌-నడాల్‌ ఎలాంటి అనుభూతి చెందారో అర్థం చేసుకోగలను. 
 
టెన్ని్‌సకు వాళ్లు ఎంతో చేశారు. మనమూ ఆటను ఎంజాయ్‌ చేశాం. వాళ్ల కెరీర్‌లో సాధించిన గొప్ప విజయాలకిది కొనసాగింపు మాత్రమే. వాళ్లు అందించిన మరచిపోలేని అనుభూతులు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి. నేనెప్పుడూ ఫెడరర్‌కు వీరాభిమానిన’ని టెండూల్కర్‌ చెప్పాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత కుర్రోళ్లు గెలవలేదు.. టీమిండియాను అంపైర్లు గెలిపించారు : ఇయాన్ మోర్గాన్