భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి సచిన్ గత 2007లోనే రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడు. కానీ, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ వివ్ రిచర్డ్స్ సచిన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సచిన్ మనసు మార్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
ఆ నాటి ఘటనపై సచిన్ స్పందిస్తూ, 2007 ప్రపంచకప్‌తోనే నా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఆ ప్రపంచ కప్ తర్వాత ఇక క్రికెట్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న. అయితే ఆ సమయంలో భారత్ క్రికెట్ చుట్టూ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో మనకు కొన్ని మార్పులు అవసరం అనిపించింది.
ఇక ఆ మార్పులు జరగకపోయి ఉంటే క్రికెట్ నుంచి తప్పుకుందాం అనుకున్నా.. కానీ అప్పుడే నా సోదరుడు 2011 ప్రపంచకప్ ఫైనల్ భారత్‌లో జరుగుతుందని చెప్పాడు.. 'ఒక్కసారి ఆ ట్రోఫీని చేతిలోకి తీసుకున్నట్లు ఊహించుకో' అని అన్నాడు.
ఆ సమయంలోనే నా అభిమాన క్రికెటర్ సర్ వివ్ రిచర్డ్స్ నుంచి ఫోన్ వచ్చింది. 'నీలో ఇంకా చాలా క్రికెట్ ఉంది' అని ఆయన చెప్పాడు. అలా తమ ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. నా బ్యాటింగ్ హీరో నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. అపుడు మనసు మార్చుని 2011 ప్రపంచ కప్ వరకు కొనసాగినట్టు సచిన్ వెల్లడించారు.