అబ్బా.. ఆస్ట్రేలియా పర్యటనే అత్యంత కఠినమైనది: సచిన్ టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో 1999లో ఆడిన ఆస్ట్రేలియా టూరే అత్యంత కఠినమైందన్నాడు. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉండేది. ఆ జట్టులోని 11 మందిలో ఏడెనిమిది మంద
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో 1999లో ఆడిన ఆస్ట్రేలియా టూరే అత్యంత కఠినమైందన్నాడు. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉండేది. ఆ జట్టులోని 11 మందిలో ఏడెనిమిది మంది మ్యాచ్ విన్నర్లేనని.. రిజర్వ్ బెంచ్ కూడా మ్యాచ్ విన్నర్లేనని సచిన్ తెలిపాడు. తన ఇరవై ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ యాత్రలో అలాంటి జట్టును ఎప్పుడూ ఎదుర్కోలేదని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
1999లోని ఆసీస్ జట్టు కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిందని సచిన్ చెప్పుకొచ్చాడు. ఎంతో దూకుడుగా ఆసీస్ ఆటగాళ్లు తమదైన శైలిలో ఆడేవారని సచిన్ చెప్పుకొచ్చాడు. స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా 3-0తో టీమిండియాను వైట్ వాష్ చేసింది.
అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 285 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మెల్ బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో 180 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఇలాంటి కీలక విజయాలు నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా జట్టులో అన్నీ జట్లు ఆడాలని సచిన్ ఆశించారు.