Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవ్వుకోని రోజు వృథాగా పోయినట్టే... నవ్వించడంలో ఎపుడూ ఓడిపోని హాస్య నటుడు : సచిన్

నవ్వుకోని రోజు వృథాగా పోయినట్టే... నవ్వించడంలో ఎపుడూ ఓడిపోని హాస్య నటుడు : సచిన్
, బుధవారం, 15 జూన్ 2016 (14:31 IST)
భారత క్రికెట్ దిగ్గజాల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఎక్కువ సమయం తన కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీతో విదేశీ టూర్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో.. ఆయన తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ లీసెస్టర్‌ నగరంలోని చార్లీ చాప్లిన్‌ విగ్రహం వద్ద ఫొటో దిగి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. 'మనం హాయిగా నవ్వుకోని రోజు వృథాగా గడిచిపోయినట్లే. నవ్వించడంలో ఎప్పుడూ ఓడిపోని ప్రతిభావంతుడైన వ్యక్తి.. హాస్య నటుడు, దర్శకుడు' అంటూ సచిన్‌ చాప్లిన్‌ గురించి రాసుకొచ్చాడు. 
 
ఇదిలావుండగా, 2013 ఆఖరుల్లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్... తన రిటైర్మెంట్ రోజున స్పందిస్తూ... '22 అడుగుల మధ్యే నా 24 ఏళ్ల జీవితం గడిచిపోయింది' అంటూ అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీళ్లతో చెప్పాడు. 16 ఏళ్ల వయసులోనే మైదానంలోకి అడుగుపెట్టిన సచిన్‌ తన అసమాన బ్యాటింగ్‌ విన్యాసాలతో అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసి.. క్రికెట్‌ చరిత్రలో లెక్కలేని రికార్డులను తిరగరాసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహ్మద్ అలీ రాసలీలల వీడియోను విక్రయిస్తా : ప్రియురాలి ప్రకటన