Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహ్మద్ అలీ రాసలీలల వీడియోను విక్రయిస్తా : ప్రియురాలి ప్రకటన

''ది గ్రేటెస్ట్''గా పేరు తెచ్చుకున్న మహ్మద్‌ అలీ అమెరికాలోని కెంటుస్కీలో లూయీస్‌ విల్లేలో 1942 జనవరి 17న పుట్టారు. అలీ అసలు పేరు కాషియస్‌ క్లే. 12వ ఏట బాక్సింగ్‌లో శిక్షణ ప్రారంభించిన అలీ 22 ఏళ్లకే ప్

మహ్మద్ అలీ రాసలీలల వీడియోను విక్రయిస్తా : ప్రియురాలి ప్రకటన
, బుధవారం, 15 జూన్ 2016 (09:53 IST)
''ది గ్రేటెస్ట్''గా పేరు తెచ్చుకున్న మహ్మద్‌ అలీ అమెరికాలోని కెంటుస్కీలో లూయీస్‌ విల్లేలో 1942 జనవరి 17న పుట్టారు. అలీ అసలు పేరు కాషియస్‌ క్లే. 12వ ఏట బాక్సింగ్‌లో శిక్షణ ప్రారంభించిన అలీ 22 ఏళ్లకే ప్రపంచ హెవీయెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. 1964లో దిగ్గజ బాక్సర్‌ సోనీలిస్టన్‌పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్‌గా మహ్మద్‌ అలీ నిలిచారు. తర్వాత ఆయన ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్‌ అలీగా పేరు మార్చుకున్నారు. 
 
1967లోనూ హెవీవెయిట్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచారు.1974లో ఫ్రేజియర్‌పై గెలుపొంది ఛాంపియన్‌షిప్‌ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లతో పాటు మరెన్నో పోటీల్లో అలీ విజయాలు సొంతంచేసుకున్నారు. అలీ తన బాక్సింగ్‌ కెరీర్‌లో ఐదుసార్లు మాత్రమే ఓటమిని చూశారు. అలీ 1981లో రిటైర్మెంట్‌ అయ్యారు. 
 
కాగా తీవ్ర అస్వస్థతతో ఫొయినిక్స్‌ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పార్కిన్సన్‌ వ్యాధి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న అలీ కొన్నేళ్లుగా చికిత్స చేయించుకున్నారు. ఆయనకు 1980లోనే ఈ వ్యాధి సోకింది. మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్‌ వ్యాధితో పోరాడుతున్న అలీ కన్నుమూయడంతో యావత్ ప్రపంచమే శోకసాగరంలో మునిగిపోయింది. ఈ బాక్సర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. 
 
ఈ క్రేజ్‌నే క్యాష చేసుకోవడానికి ఆయన అతని మాజీ ప్రియురాలు ప్లాన్ వేసింది. మహ్మద్ అలీ తనతో గడిపిన మధుర క్షణాలని వీడియోలు ద్వారా అమ్ముతానంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. అలీ బాక్సింగ్ ఫైట్స్ అనంతరం జంబో నైట్స్ పేరుతో పార్టీలు జరిగేవట. ఆ పార్టీల్లో మహ్మద్ తనతో చాలాసార్లు కలిశాడని... అంతేకాకుండా అతను, స్నేహితులు 12 మందికి పైగా అమ్మాయిలతో రాసలీలలో తేలిపోయేవాడని ఆమె తెలిపింది. ఆ వీడియోలు కూడా తన దగ్గర భద్రంగా ఉన్నాయని ప్రకటన చేసింది. వాటిని అమ్మకానికి పెడతానంటూ... అంతేకాదు అలీ తన భార్యకు ఇచ్చిన గౌరవమే తనకు ఇచ్చేవాడని మెన్సా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ దేవుడు సచిన్ ఉదారత.. మిద్నాపూర్ పాఠశాలలకు రూ.76లక్షల ఆర్థిక సాయం!