Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సచిన్‌కు కొత్త బీడబ్ల్యూఎం కారు.. సంజ్ఞల కంట్రోల్.. టచ్ స్క్రీన్... గంటకు వేగం 250 కిమీ

క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ కార్ల జాబితాలోకి కొత్త వాహనం చేరింది. ఇప్పటికే పలు కార్లను కలిగి ఉన్న సచిన్ తన అభిరుచి మేరకు మరో బిఎమ్‌డబ్ల్యూ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్ఐ కారును

Advertiesment
Sachin Tendulkar
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:24 IST)
క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ కార్ల జాబితాలోకి కొత్త వాహనం చేరింది. ఇప్పటికే పలు కార్లను కలిగి ఉన్న సచిన్ తన అభిరుచి మేరకు మరో బిఎమ్‌డబ్ల్యూ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్ఐ కారును తన అభిరుచిమేరకు సదరు కార్ల సంస్థ తయారుచేసి ఇచ్చింది. ఎం స్పోర్ట్ ప్యాకేజీ ఉన్న బీఎండబ్ల్యూ 750ఎల్ఐ వాహనాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ ఏడాదిలో సచిన్ కొనుగోలు చేసిన రెండో కారు ఇది కావడం విశేషం. 
 
ఇప్పటికే కస్టమైజ్ చేసిన బీఎండబ్ల్యూ ఐ8ను కూడా సచిన్ మాస్టర్ బ్లాస్టర్ వాడుతున్నాడు. బిఎమ్‌డబ్ల్యూ 2016లో 7 సిరీస్ కొత్త మోడల్‌ను భారతదేశంలోఆవిష్కరించిన సమయంలో దాన్ని లాంచ్ చేసింది సచినే. ఈ న్యూ జనరేషన్ కార్‌కు యాక్టీవ్ ఏరో ఫంక్షన్‌తో పాటు పెద్ద కిడ్ని గ్రిల్ కూడా ఉంది. వీటి ద్వారా ఇంధన సామర్ధ్యం కూడా పెరుగుతుంది. అయితే సచిన్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఎం స్పోర్ట్స్ ప్యాకేజ్ కారుకు సరికొత్త స్పోర్టీ ఫ్రంట్ బంపర్‌ను అమర్చారు. 
 
కారుకు సరికొత్త, అనుకూలమైన డిజిటల్ ఐడ్రైవ్ 5.0 టీవీ సిస్టమ్ కూడా ఉంది. దీనికి టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంది. రిమోట్ కంట్రోల్ పార్కింగ్, సంజ్ఞల కంట్రోల్, 7 అంగుళాల రిమూవబుల్ టాబ్లెట్‌ కూడా ఉంది. కారులోపలి గాలిని ఫ్రెష్‌గా మార్చడంతో పాటు హీటెడ్ డోర్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. 650ఎన్ఎమ్‌ టార్క్‌తో 450బిహెచ్‌పి సామర్ధ్యంతో 4.4 లీటర్ల ట్విన్ పవర్ టర్బో గల వి8 ఇంజన్ ఉంది. దీని అత్యధిక స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వేగం. అయితే దీన్ని చేరుకునే ముందు 4.7 సెకండ్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంటి భారత్ ప్రతిష్టాత్మక 500వ టెస్టు... సన్నద్ధమైన న్యూజిలాండ్