Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పోరాడితే పోయేదేం లేదు....' నాడు శ్రీశ్రీ.. నేడు కోహ్లీ

'పోరాడితే పోయేదేం లేదు....' నాడు శ్రీశ్రీ.. నేడు కోహ్లీ
, సోమవారం, 23 మే 2016 (16:24 IST)
"పోరాడితే పోయేదేం లేదు.." అని నాడు మహాకవి శ్రీశీ అన్నారు. నేడు దీన్నే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటున్నారు. స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ముగిశాక.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. దీంతో టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలో ఉన్న ఆర్సీబీ నాకౌట్‌కు చేరుకుంది. ఇదే కెప్టెన్ కోహ్లీని ఆలోచింపజేసింది. 
 
జట్టు గెలుపు భారాన్ని బౌలర్లపై నెట్టడం కంటే.. తమ భుజస్కంధాలపైనే మోయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అనుగుణంగా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డివిలియర్స్, వాట్సన్ వంటి ఆటగాళ్ళతో చర్చించి వ్యూహాలు రచించారు. భారం బౌలర్లపై వేయడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని, ఇకపై అలాంటిది జగరక కూడదని తీర్మానించుకున్నారు. 
 
మైదానంలో దిగిన తర్వాత 150 పరుగులు చేయగలిగిన చోట 170 పరుగులు చేయాలని నిర్ణయించారు. అదేసమయంలో జట్టులో కీలక ఆటగాళ్లు గేల్, కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్‌లు నిలకడగా బ్యాటింగ్ చేయాలనీ, అనవసరపు షాట్‌లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకోరాదని నిర్ణయించుకున్నారు. అలాగే, టాస్ గెలిస్తే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో పరిస్థితులకు తగ్గట్టు ఆడవచ్చని భావించారు. 
 
ఈ వ్యూహం సత్ఫలితాన్నిచ్చింది. దీనికి టాస్ కూడా కలిసి రావడంతో టోర్నీలో నాకౌట్‌కు చేరే అవకాశం లేదని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2 జట్టుగా నాకౌట్‌లో అడుగుపెట్టింది. అదేసమయంలో టోర్నీలోనే అత్యధిక పరుగుల చేసిన టాప్ ముగ్గురు బ్యాట్స్‌మన్‌లో కోహ్లీ, డివిలియర్స్ స్థానం సంపాదించుకున్నారు. మరో అడుగు వేస్తే టైటిల్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడం సాధ్యమే. దీంతో పోరాడితే పోయేదేం లేదు ఓటమి భారం తప్ప అన్న శ్రీశ్రీ మాటలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధ్యం చేసి చూపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్ గేల్ సెక్స్ కామెంట్స్.. డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు.. నువ్వు ఆ పని చేసి వుంటావు!?