Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాళ్లిద్దరు మ్యాచ్‌ను దూరం చేస్తారని భావించా : రోహిత్ శర్మ

rohit sharma
, గురువారం, 16 నవంబరు 2023 (10:16 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించి, ఫైనల్‌లో అడుగుపెట్టింది. గురువారం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో ఈ నెల 19వ తేదీన భారత్ టైటిల్ కోసం తలపడుతుంది. అయితే, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 397 పరుగులు చేసినా.. ఒకానొక దశలో కివీస్‌ లక్ష్య ఛేదన దిశగా సాగడంతో భారత అభిమానుల్లో కాస్త కలవరం రేగింది. కానీ, భారత బౌలర్లు పుంజుకుని కివీస్‌ను కట్టడి చేయడంతో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, 
 
'వాంఖడే మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడా. అలాగని రిలాక్స్‌గా ఉండకూడదు. వీలైనంత త్వరగా మన బాధ్యతలను ముగించాలి. సెమీస్‌ వంటి మ్యాచ్‌లలో ఒత్తిడి సహజం. అయినా నిశ్శబ్దంగా మా బాధ్యతలను నిర్వర్తించాం. ఎప్పుడైతే లక్ష్య ఛేదనలో రన్‌రేట్‌ 9కి కంటే ఎక్కువగా ఉందో.. అప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అయితే, డారిల్ మిచెల్ - కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడారు. వారిద్దరూ క్రీజ్‌లో ఉన్నంతవరకు కాస్త ఒత్తిడికి లోనయ్యారు. పైగా, ఒకదశలో స్టేడియంలోని ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. క్రికెట్ మ్యాచ్‌ అంటేనే ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలనే దానిపై మాకు అవగాహన ఉంది. షమీ అద్భుతం చేశాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 
 
ఇక బ్యాటింగ్‌లో టాప్‌ 6 ఆటగాళ్లు రాణించడం మరింత సంతోషంగా ఉంది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ అద్భుత ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. కోహ్లీ తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. మా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు సూపర్బ్. ఇదే ఉత్సాహంతో టైటిల్‌ పోరు బరిలోకి దిగుతాం. ఇంగ్లండ్‌పై 230 పరుగులు చేసినా మా బౌలర్లు కాపాడారు. ముందుండి జట్టును గెలిపించారు. ఇవాళ మ్యాచ్‌లో దాదాపు 400 కొట్టినా ఒత్తిడి లేదని చెప్పలేను. కానీ, మా ఆటగాళ్లు రాణించడంతోనే విజయం ఖాయమైంది. లీగ్‌ దశలో 9 మ్యాచుల్లో మేం ఏం చేశామో.. దానినే కొనసాగించాం' అని రోహిత్ శర్మ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ