సానియా మీర్జా స్వీట్ గర్ల్.. సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం: రోజర్ ఫెదరర్

మంగళవారం, 15 డిశెంబరు 2015 (10:25 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ''స్వీట్ గర్ల్'' అని స్విజ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపాడు. సచిన్ టెండూల్కర్ అన్నా తనకు ఇష్టమని, వీడియోగేమ్ క్రికెట్ ఆడుతుంటే తన జట్టులో సచిన్ ఉండాల్సిందేనని అన్నాడు. భారత్‌కు రావడం తనకెంతో సంతోషమని తెలిపాడు. అయితే టెన్నిస్ ప్రపంచంలో తన సత్తా చాటడం ప్రారంభించిన తర్వాత ఇండియాలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని రోజర్ ఫెదర్ వ్యాఖ్యానించాడు. 
 
ఐపీటీఎల్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఫెడ్ మీడియాతో మాట్లాడుతూ, తాను 2014లో సానియాతో కలసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడానని, అప్పటికే ఆమెతో పరిచయం ఉందని ఫెదరర్ చెప్పుకొచ్చాడు. హింగిస్‌తో కలసి సానియా వింబుల్డన్ డబుల్స్ ఫైనల్‌లో అద్భుత ఆటతీరు కనబరిచిందని ప్రశంసించాడు.

వెబ్దునియా పై చదవండి