Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిస్టర్ కూల్‌ ధోనీకి గర్వమెక్కువ.. ఫోన్ చేసినా దొరికేవాడు కాదు.. పుణె ఓనర్ గోయెంకా ఆరోపణలు

క్రికెట్ మైదానంలోనేకాకుండా, బయట కూడా మిస్టర్ కూల్‌గా కనిపించే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సన్‌రైజింగ్ పూణె ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సంచలన ఆరోపణలు చేశారు. ధోనీకి గర్వమ

మిస్టర్ కూల్‌ ధోనీకి గర్వమెక్కువ.. ఫోన్ చేసినా దొరికేవాడు కాదు.. పుణె ఓనర్ గోయెంకా ఆరోపణలు
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (11:46 IST)
క్రికెట్ మైదానంలోనేకాకుండా, బయట కూడా మిస్టర్ కూల్‌గా కనిపించే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సన్‌రైజింగ్ పూణె ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సంచలన ఆరోపణలు చేశారు. ధోనీకి గర్వమెక్కువ అని, ఫోన్ చేసిన దొరికేవాడు కాదంటూ ఆరోపించారు. 
 
ఐపీఎల్ పదో సీజన్‌లో పూణె జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీని తప్పించిన విషయంతెల్సిందే. ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పూణె జట్టు యజమాని స్పందిస్తూ జట్టు యజమానులమైన తమను ధోని లేశమాత్రమైనా పట్టించుకోరని ఆరోపించారు. ధోనీ ఎప్పుడూ ఫోన్‌లైన్లో కూడా తమకు అందుబాటులోకి రాలేదని, కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఏజెంట్ అరుణ్ పాండే ద్వారా మాత్రమే అతడిని కలిసే వీలుండేదన్నారు. గతేడాది లీగ్ సమయంలో కూడా ధోని జట్టు సమావేశాల్లో పాల్గొనలేదని పేర్కొన్న గోయెంకా, సమావేశంలో చర్చించిన దానికి భిన్నంగా ఫీల్డింగ్‌ను ధోని మార్చేశాడని ఆరోపించారు. సమావేశంలో ఏం చర్చించారన్న విషయం కూడా ధోనికి తెలియదని ఓ సీనియర్ ఆటగాడు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు వివరించారు.
 
నెట్ ప్రాక్టీసులకు ధోని హాజరు కాడని, లెగ్ స్పిన్నర్ జంపాను తుదిజట్టులోకి తీసుకోమని చెబితే.. తానెప్పుడూ అతడి ఆటను చూడలేదని చెప్పి తమకు షాకిచ్చాడని గోయెంకా తెలిపారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన బాగాలేకున్నా సౌరభ్ తివారీని తీసుకోవాలని ధోని ఒత్తడి తెచ్చాడని, జట్టు జెర్సీ రంగు, డిజైన్ గురించి అతడి సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదని తెలిపారు. నిజాలను ముఖం మీదే చెప్పడం తనకు అలవాటని, ఫ్రాంచైజీల మేలు కోరే ధోనిని తప్పించామని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితాన్ని మార్చే మొత్తం: ఉక్కిరిబిక్కిరవుతున్న బెన్ స్టోక్స్