ఇటీవల పెను ప్రమాదానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రిలీజ్ చేశాడు. గత నెల26వ తేదీన ఈ ఆటగాడి మోకాలికి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది.
గత యేడాది డిసెంబరు 30వ తేదీన రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రూర్కీ సమీపంలో పెను ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో పంత్ తాజాగా తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో నడుస్తున్న ఫొటోల్ని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఒక అడుగు ముందుకు. ఒక అడుగు బలంగా. ఒక అడుగు మరింత మెరుగ్గా' అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత పంత్ సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి.