తాను వందే టెస్ట్ ఆడుతున్నాననే ఆనందం కంటే... తనకు ఉద్విగ్నంగా అధికంగా ఉందని భారత లెగ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల ధర్మాశాల వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ జగనుంది. ఇది అశ్విన్‌కు వందో టెస్ట్ మ్యాచ్. టెస్టు ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు' గెలుచుకున్న భారతీయ క్రికెటర్‌గా ఉన్న అశ్విన్.. అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాలోనూ అగ్రస్థానం దిశగా చేరువవుతున్నాడు.
ఇప్పటివరకు అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు'లు గెలుచుకున్న ఆటగాడిగా శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 11 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల'తో ముత్తయ్య అగ్రస్థానంలో ఉండగా 10 అవార్డులతో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ మరో అవార్డు అందుకుంటే మురళీధరన్‍తో సమంగా నిలవనున్నాడు.
ఇక టెస్ట్ ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న టాప్-5 ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ మూడో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 9 టెస్టుల సిరీస్‌లలో ఈ అవార్డు దక్కించుకున్నాడు.
పాకిస్థాన్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ మొత్తం 8 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులతో నాలుగో స్థానంలో నిలిచాడు. 28 సిరీస్‌లో ఈ అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఇక న్యూజిలాండ్‌కు చెందిన సర్ రిచర్డ్ హ్యాడ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 33 టెస్టు సిరీస్‌లు ఆడిన రిచర్డ్ హ్యాడ్లీ 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు.
కాగా రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ భారతీయ క్రికెటర్ గా అశ్విన్ నిలిచిన విషయం తెలిసిందే.