Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన్‌మోహన్ సింగ్ లాంటి యస్ బాస్ రవిశాస్త్రి.. అందుకే కోహ్లీకి అతడంటే అంత ఇష్టం

మొత్తానికి విరాట్ కోహ్లీ యస్ బాస్ రకం కోచ్‌నే తెచ్చుకుంటున్నాడు. తన మాట వింటే చాలు కొండమీద కోతైనా కోచ్‌గా పనికొస్తాడన్న కోహ్లీ పంతమే గెలుస్తోంది. కోహ్లీ వలచిన ఆ కొండమీది కోతి మరెవరో కాదు. ది గ్రేట్ రవిశాస్త్రి. అటు కోహ్లీ, ఇటు సచిన్ టెండూల్కర్ ఇద్దరూ

మన్‌మోహన్ సింగ్ లాంటి యస్ బాస్ రవిశాస్త్రి.. అందుకే కోహ్లీకి అతడంటే అంత ఇష్టం
హైదరాబాద్ , గురువారం, 29 జూన్ 2017 (07:49 IST)
మొత్తానికి విరాట్ కోహ్లీ యస్ బాస్ రకం కోచ్‌నే తెచ్చుకుంటున్నాడు. తన మాట వింటే చాలు కొండమీద కోతైనా కోచ్‌గా పనికొస్తాడన్న కోహ్లీ పంతమే గెలుస్తోంది. కోహ్లీ వలచిన ఆ కొండమీది కోతి మరెవరో కాదు. ది గ్రేట్ రవిశాస్త్రి. అటు కోహ్లీ, ఇటు సచిన్ టెండూల్కర్ ఇద్దరూ అభయహస్తమిచ్చి గట్టిగా తోస్తే ముందుకొచ్చి పడ్డ రవి టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. బీసీసీఐ ఆహ్పానించినప్పుడు అటు పక్కకు కూడా రాని రవిశాత్రి కోహ్లీ దన్నుతోనే బరిలో నిలబడ్డాడని స్పష్టంగా తెలుస్తోంది. 
 
కానీ రవిశాస్త్రి కోహ్లీకి, సచిన్‌కి ఇష్టుడు కావచ్చు కాని టీమిండియా అభిమానులుకు మాత్రం కాదు. రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాడన్న వార్త వినగానే నెటిజన్లు, క్రికెట్ అభిమానులు యస్ బాస్ రవిశాస్త్రిని తల్చుకుని మరీ జోకులేసుకుంటున్నారు. 
 
రవిశాస్త్రిని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పోల్చి మరీ ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు,. తన పదేళ్ల పాలనలో దేశం కీలక రంగాల్లో విధ్వంసానికి గురువుతున్నా పట్టించుకోకుండౌ మౌనమునిలా గడిపిన మన్మోహన్ దేశ చరిత్రలో ఏ ప్రధానికి సాధ్యం కానంతగా అభాసు పాలయ్యారు. ప్రత్యేకించి తన రెండో దఫా పాలనలో పాలనాపరంగా పక్షవాతానికి గురిచేసి సంస్కరణలను అమలు చేయడంలో విఫలమైని ప్రధానిగా, కొంప మునుగుతున్న చేష్టలుడిగి దిక్కులు చూస్తూ గడిపేసిన అసమర్థ ప్రధానిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయాడు.
 
బీసీసీఐ రవిశాస్త్రినే టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించనున్నదని తేలిపోతున్న తరుణంలో విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి మరియు సింగ్-సోనియాగాంధీ మధ్య పోలికలను చూస్తూ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వేచ్ఛగా వదిలేసే కోచ్‌ని కోరుకుంటున్నారా.. జట్టు చంకనాకిపోతుందన్న గవాస్కర్