ఐపీఎల్ వార్... రాయల్స్ విజయలక్ష్యం 157..!

ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (18:12 IST)
ఐపీఎల్-8లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 156 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సమాయత్తమవుతోంది.
 
చెన్నై జట్టులో మిడిలార్డర్ లో డ్వెన్ బ్రావో (62 నాటౌట్) దూకుడు ప్రదర్శించడంతో, డ్వెన్ స్మిత్ (40), ధోనీ (31 నాటౌట్) రాణించారు. చెన్నై ఓ దశలో 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టాపార్డర్లో బ్రెండన్ మెకల్లమ్ (12), రైనా (4), డుప్లెసిస్ (1) పరుగులు చేసి విఫలమయ్యారు. ఈ సమయంలో బ్రావో, ధోనీ జట్టును ఆదుకున్నారు.  రాజస్థాన్లో అంకిత్ శర్మ, మోరిస్, తాంబె, ఫాల్కనర్ తలా ఒక్కో వికెట్ తీశారు.

వెబ్దునియా పై చదవండి