Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్టిండీస్‌తో రెండో టెస్టు: 158 పరుగులతో రాహుల్ అదుర్స్.. విండీస్ గడ్డపై తొలి టెస్టుతో రికార్డు!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో అదే జోరును కొనసాగిస్తోంది. విండీస్ క్రికెటర్లకు అటు బౌలింగ్, ఇటు బౌలింగ్‌లోనూ చుక్కలు చూపిస్తోంది.

Advertiesment
Rahul
, సోమవారం, 1 ఆగస్టు 2016 (15:53 IST)
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో అదే జోరును కొనసాగిస్తోంది. విండీస్ క్రికెటర్లకు అటు బౌలింగ్, ఇటు బౌలింగ్‌లోనూ చుక్కలు చూపిస్తోంది. కింగ్‌స్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ విజృంభించడంతో భారత్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. తద్వారా ప్రత్యర్థి జట్టు కంటే భారత్ 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
 
ఇక ఈ మ్యాచ్‌లో 158 పరుగులు సాధించి కెరీర్‌లో అత్యుత్తమ స్కోరును నమోదు చేసుకున్న రాహుల్.. జట్టు స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ప్రస్తుతం అజింక్యా రహానె(42), వృద్ధిమాన్ సాహా(17) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 126/1తో భారత్ ఇన్నింగ్స్ కొనసాగించింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో రాహుల్- పుజారా నిలకడగా క్రీజులో రాణించారు. 56వ ఓవర్లో సిక్సర్‌తో వంద పరుగులు పూర్తిచేసిన రాహుల్ కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.  
 
లంచ్ విరామానికి తర్వాత పుజారా (46) అర్థ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో భారత్ రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లైంది. అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో కలిసి జాగ్రత్తగా ఆడిన లోకేశ్ లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కోహ్లీ రాకతో వేగం పెంచిన రాహుల్ (158) 96వ ఓవర్లో 277 పరుగుల వద్ద గాబ్రియల్ బౌలింగులో డౌరిచ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 
 
ఆపై కోహ్లీ (44), రవిచంద్రన్ అశ్విన్ (3) వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. అంతకుముందు వెస్టిండీస్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో షానన్ గాబ్రియల్, దేవేంద్ర బిషూ చెరో వికెట్ పడగొట్టగా రోస్టన్ చేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ తెచ్చిన తంటా.. సెల్ఫీ తీస్తూ చెరువులో పడిన అథ్లెట్.. ఈత రాకపోవడంతో మృతి!