Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాపై 177పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం: రబాడాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన తొలి టెస్టులో సఫారీలు విజయకేతనం ఎగురవేశారు. 539 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా సెకండఫ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 361 పరుగ

Advertiesment
ఆస్ట్రేలియాపై 177పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం: రబాడాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
, సోమవారం, 7 నవంబరు 2016 (14:46 IST)
ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన తొలి టెస్టులో సఫారీలు విజయకేతనం ఎగురవేశారు. 539 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా సెకండఫ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 361 పరుగులకే ఆలౌటైంది. తద్వారా తొలి టెస్టులో సఫారీలు 177 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. 119.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కంగారులు, కగిసో రబాడా దెబ్బకు పెవిలియన్ క్యూ కట్టారు. 
 
31 ఓవర్లపాటు బంతులేసిన రబాడా ఐదు వికెట్లు నేలకూల్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రబాడా మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు 1-0 తేడాతో ముందు నిలిచింది. సెకండ్ టెస్ట్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు సఫారీల చేతిలో 0-5 తేడాతో వైట్‌వాష్‌ అయిన సంగతి తెలిసిందే. 
 
69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 361 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి ఎదుర్కొంది. ఓవర్ నైట్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా(97) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం ఆటలో ఆస్ట్రేలియా 195 పరుగుల వద్ద ఉండగా మిచెల్ మార్ష్(26) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తరువాత నేవిల్‌తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు.
 
ఈ జోడి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించిన తరువాత ఖవాజా అవుటయ్యాడు. దాంతో ఆసీస్ ఓటమి ఖరారైంది. కాగా, చివర్లో టెయిలెండర్లతో కలిసి నేవిల్(60 టౌట్) ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టడంతో దక్షిణాఫ్రికా విజయంలో జాప్యం ఏర్పడింది. చివరి వికెట్లతో కలిసి హాఫ్ సెంచరీ సాధించిన నేవిల్.. అజేయంగా క్రీజ్‌లో నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై వేధింపుల కేసులో బంగ్లా క్రికెటర్ నిర్దోషి : కోర్టు తీర్పు