Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అటు కోహ్లీ, ఇటు అశ్విన్ ఇద్దరి కథా చూస్తామంటున్న ఆసీస్

మాటల యుద్ధం మొదలెట్టకుండా, మైండ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఆటపట్టించకుండా నిజమైన ఆటను మొదలుపెట్టకపోవటం ఆసీస్ జట్టు సహజ లక్షణం, దక్షిణాప్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వరుసగా ప్రపంచ స్థాయి జట్లన్నీ ఇండియాకు తిరిగివచ్చి కోహ్లీ సేన చేతిలో చిత్తయిప

అటు కోహ్లీ, ఇటు అశ్విన్ ఇద్దరి కథా చూస్తామంటున్న ఆసీస్
హైదరాబాద్ , గురువారం, 16 ఫిబ్రవరి 2017 (06:09 IST)
మాటల యుద్ధం మొదలెట్టకుండా, మైండ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఆటపట్టించకుండా నిజమైన ఆటను మొదలుపెట్టకపోవటం ఆసీస్ జట్టు సహజ లక్షణం,  దక్షిణాప్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వరుసగా ప్రపంచ స్థాయి జట్లన్నీ ఇండియాకు తిరిగివచ్చి కోహ్లీ సేన చేతిలో చిత్తయిపోతుంటే ఆసీస్ మాత్రం తన పంధాను వదలటం లేదు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్ అడేందుకు భారత్ వచ్చిందో లేదో ఆసీస్ జట్టు కెప్టెన్ నుంచి, బౌలర్లు, బ్యాట్స్ ‌మెన్‌ల వరకు అందరూ ఒకటే రాగం మొదలెట్టేశారు. కోహ్లీసేనతో కష్టమే కానీ అంత సులభంగా వారిని వదిలిపెట్టం అంటున్నారు. అశ్విన్ కోసం గేమ్ ప్లాన్ సిద్ధం చేశాం అని ఒకరంటే, కోహ్లీకి సవాలు విసిరే ఆయుధాన్ని వెంట పట్టుకొచ్చామని మరొకరు వాగ్బాణాలు మొదలెట్టేశారు
 
భారత్‌తో 4 టెస్ట్‌ల సిరీస్ ఆడనున్న కంగారూలు ఇప్పటికే మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ టీమిండియా ఆఫ్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవడానికి ‘గేమ్ ప్లాన్‌’తో సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ‘‘అశ్విన్ వంటి బౌలర్‌ను గౌరవించాలి. అతను ఓ బ్యాట్స్‌మన్‌లా ఆలోచిస్తాడు. అతని శక్తి సామర్థ్యాలకు దీటుగా నేను బ్యాటింగ్ చేయాలి. అతను కూడా నా కోసం సిద్ధమయ్యే ఉంటాడు. నా దగ్గరో గేమ్ ప్లాన్ ఉంది. ఇద్దరం పరిస్థితులకు అనుగుణంగా ఆడాలి. మా ఇద్దరికీ ఓ సమరమే జరగబోతోంది’’ అని వార్నర్ చెప్పాడు.
 
టీమిండియా కెప్టెన్ సత్తా ఏమిటో తెలుసునంటూనే అతనిపై ప్రయోగించడానికి ఆస్ట్రేలియా వద్ద ఓ ఆయుధం ఉందని మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ అన్నాడు. ‘‘మిచెల్ స్టార్క్ బ్రిలియంట్ బౌలర్. ఉపఖండంలో పరిస్థితులకు అతికనట్లు సరిపోతాడు. మంచి పేస్. కొత్త బంతిని బాగా స్వింగ్ చేయగలడు. రివర్స్ స్వింగ్‌లూ సంధించగలడు. సిరీస్ మొత్తం అతను కోహ్లీకి సవాల్ విసరగలడని ఖచ్చితంగా చెప్పగలన’’ని హస్సీ అన్నాడు. ఏమైనా కోహ్లీ దూకుడును ఆపాలంటే టీమ్ వర్క్ ముఖ్యమని ఆసీస్ జట్టుకు సూచించాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఫామ్ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరస్తూ అభినందనలు అందుకుంటోంది. ఆసీస్ అతడిని నిలువరించగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాకు చేదు అనుభవం: కిట్ బ్యాగుల్ని మోసుకుని.. వాళ్లే వ్యానుల్లో లోడ్ చేసుకున్నారు..