Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కప్ : కొనసాగుతున్న పాకిస్థాన్ జోరు... సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో గెలుపు

Advertiesment
pakistan team
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (08:31 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు మంచి ఊపుమీదున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌ మాత్రం వర్షం కారణంగా రద్దు అయింది. ఇదిలావుంటే, సూపర్-4లో భాగంగా, బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్ జట్టు విజయభేరీ మోగించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 38.4 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లు హారిస్ రవూఫ్ 4, నసీమ్ షా 3 చొప్పున వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలిపోయింది. అలాగే, ఆ జట్టులో ముష్పికర్ రవీం 64, షకీబ్ అల్హసన్ 53 మిహనా మిగిలిన బంగ్లా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగిన స్కోరును చేయలేక పోయారు. 
 
ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు... 39.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్ 78, రిజ్వాన్ 63లు రాణించడంతో ఆ జట్టు విజయం సులభతరమైంది. శనివారం జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఆతిథ్య శ్రీలంక జట్టుతో తలపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భారత్'గా దేశం పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ మద్దతిస్తున్నారా?