Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు - లబోదిబోమంటున్న హోటల్

బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు - లబోదిబోమంటున్న హోటల్
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:21 IST)
ఇటీవల క్రికెట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ దేశానికి వచ్చింది. కానీ, మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ సిరీస్‌ను రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా కివీస్ బోర్డు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
అయితే, పాక్ గడ్డపై అడుగుపెట్టిన కివీస్ క్రికెటర్లకు భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెరికల్లాంటి కొదరు కమాండోలతో భద్రతను కల్పించింది. కివీస్ ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం 500 మంది కమాండోలను రంగంలోకి దించింది. 
 
అయితే, న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కేవలం భద్రతా సిబ్బంది బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు అయిందట. న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి వెళ్లిపోవడంతో, పాక్ ప్రభుత్వం ఆ బిల్లులను పెండింగ్‌లో ఉంచింది. హోటల్ నిర్వాహకులు మాత్రం లబోదిబోమంటున్నారు. 
 
భద్రతా సిబ్బందికి రోజుకు రెండుసార్లు బిర్యానీ పెట్టామని వారు వెల్లడించారు. ఈ బిర్యానీ బిల్లు ప్రస్తుతం పాక్ ఆర్థికశాఖ వద్ద ఉందట. కమాండోలకు తోడు సరిహద్దు భద్రతాదళం పోలీసులను కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్ల కోసం పిలిపించారు. వారి భోజన బిల్లులు అదనం అని హోటల్ వర్గాలు తెలిపాయి.
 
మరి పాక్ క్రికెట్ బోర్డు దీనిపై ఏంచేస్తుందో చూడాలి. నష్ట పరిహారం రూపంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కొంత మొత్తం కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, 2009లో శ్రీలంక జట్టుపై పాక్‌లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి చాన్నాళ్లపాటు విదేశీ జట్లు పాక్‌లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు వచ్చినా, వన్డే సిరీస్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆ పర్యటన రద్దు కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్ రాయల్స్ వండర్స్.. చివరి ఓవర్‌లో గెలుపు