భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకోని పక్షంలో కేరళ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోనున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. వన్డే ప్రపంచకప్‌లో సంజూని చేర్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది.
గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రకపోవచ్చునని క్రికెట్ వర్గాల అనుమానం ఏర్పడింది. అంతేగాకుండా.. వెస్టిండీస్ సిరీస్, ఆసియా కప్‌లో అతని ప్రదర్శన ఆధారంగా సంజూ ప్రపంచ కప్ జట్టులోకి తీసుకునే అవకాశం వుంది.
గత డిసెంబర్‌లో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్ నాటికి రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌గా ఉండే అవకాశం లేదు. ఈ స్థితిలో వన్డే ప్రపంచకప్ జట్టులోకి సంజూ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు. ఒకవేళ సంజూని జట్టులోకి తీసుకున్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం లేదు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ప్రపంచకప్ జట్టులో ఉంటారు. వీరి తర్వాతే సంజూ ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడతాడు.
రిషబ్ పంత్ లేకపోవడంతో, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ స్థానాన్ని ప్రధానంగా పరిగణిస్తారు. దీంతో బ్యాటింగ్ స్థానానికి కేఎల్ రాహుల్‌ను తీసుకునే ఛాన్స్ వుంది. వన్డేల్లో మిడిలార్డర్‌లో రాణిస్తున్న రాహుల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చేందుకు సెలక్టర్లు సిద్ధంగా లేరు. రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా వస్తే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండరు.