Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజ్ఞానంద మరో సంచలనం : మాగ్నస్ కార్ల్‌‍సన్‌కు చుక్కలు..

pragnananda

ఠాగూర్

, గురువారం, 30 మే 2024 (10:53 IST)
భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరో సంచలనం నమోదు చేశాడు. చెస్‌లో కొరకరాని కొయ్యగా పేరొందిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మరోసారి ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతణ్ని క్లాసికల్ చెస్‌ గేమ్‌లో మట్టికరిపించాడు. ఇది ప్రజ్ఞానందకు కీలక మైలురాయి. 2024 నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌లో తెల్ల పావులతో ఆడిన అతడు కార్ల్‌సన్‌ ఆట కట్టించాడు. ఈ మ్యాచ్‌ను 37 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. గతంలో ర్యాపిడ్‌/ఎగ్జిబిషన్‌ గేమ్స్‌లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు ఉన్నాయి.
 
చెస్ చరిత్రలోనే కార్ల్‌సన్‌కు గొప్ప ఆటగాడిగా పేరుంది. గత దశాబ్దకాలంగా క్లాసికల్‌ చెస్‌లో అతడిదే ఆధిపత్యం. తాజా గెలుపుతో ప్రజ్ఞానంద కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆట ఆరంభంలో కార్ల్‌సన్‌ చేసిన కొన్ని తప్పులను ఆసరా చేసుకున్న ప్రజ్ఞానంద తనదైన శైలిలో దూసుకెళ్లాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రమంలో భారత యువ సంచలనం ఆట ఆసాంతం వ్యూహాత్మక ఎత్తులతో గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు. 
 
చివరకు గెలుపును సొంతం చేసుకొని తన సత్తా చాటాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరాడు. కార్ల్‌సన్‌ ఐదో స్థానానికి పడిపోయాడు. క్లాసికల్‌ చెస్‌లో పావులను కదిపేందుకు ఎంత సమయమైనా తీసుకోవచ్చు. ఒక్కోసారి తమ వ్యూహాలకు పదునుపెడుతూ ఆటగాళ్లు ఒక్కో ఎత్తుకోసం గంట సమయం తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 ప్రపంచ కప్ : అమెరికాలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న భారత్!!