రాహుల్ ద్రవిడ్ - జహీర్‌లకు షాకిచ్చిన రవిశాస్త్రి.. ఎలా?
భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా నియమితులైన రవిశాస్త్రి మాజీ సీనియర్ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లకు షాకిచ్చారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకున్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్ట
భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా నియమితులైన రవిశాస్త్రి మాజీ సీనియర్ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లకు షాకిచ్చారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకున్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టుకు సహాయక బౌలింగ్ కోచ్‌గా అరుణ్, అసిస్టెంట్ కోచ్‌గా సంజయ్ బంగర్‌ను నియమించింది. వీరిద్దరూ 2019లో జరిగే ప్రపంచ కప్ వరకు కొనసాగుతారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు.
ఇకపోతే.. అటు ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్ కొనసాగనున్నాడు. ఇక బ్యాటింగ్, బౌలింగ్ కన్సల్టెంట్లుగా సీఏసీ నియమించిన ద్రవిడ్, జహీర్‌ఖాన్‌లపై బోర్డు తుది నిర్ణయం తీసుకోకపోయినా.. వీళ్లను హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆహ్వానించాడు. ద్రవిడ్, జహీర్ ఇద్దరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడానని, వాళ్ల సలహాలు, సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రి చెప్పడం కొసమెరుపు.