ధోనీ బసచేసిన ఢిల్లీ హోటల్‌లో అగ్నిప్రమాదం.. కిట్ బూడిదైపోయింది.. మ్యాచ్ రద్దు..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ధోనీ నగరంలోని ఓ హోటల్‌లో జట్టు సభ్యులంతా బసకు దిగారు. ఈ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోట
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ధోనీ నగరంలోని ఓ హోటల్‌లో జట్టు సభ్యులంతా బసకు దిగారు. ఈ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆటగాళ్లు అక్కడ్నుంచి పరుగులు తీశారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
జార్ఖండ్ కెప్టెన్‌గా హజారే ట్రోఫిలో పాల్గొంటున్న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ధోనీ ఢిల్లీ వెళ్లారు. ఉన్నట్టుండి అగ్నిప్రమాదం జరిగింది.. పైగా కిట్ మొత్తం బూడిదపాలవ్వడంతో మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇకపోతే.. మంటలు చెలరేగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో సుమారు గంటపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకున్నారు.